
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Two Snakes Fighting On Road Latest Video: సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే మనలో చాలామందికి భయం వేస్తూ ఉంటుంది. అలాంటిది రెండు భారీ నాగుపాములు రోడ్డుపై ప్రత్యక్షమై.. ఒకదానికొకటి మెలికలు తిరుగుతూ గాల్లోకి లేచి నృత్యం చేస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా? సరిగ్గా ఇలాంటి ఒక అత్యంత ప్రమాదకరమైన.. ఆశ్చర్యం కలిగించే అరుదైన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసం.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. రెండు భారీ నాగుపాములు నడిరోడ్డుపై ఒకదానికొకటి తమ శరీరాలను పెనవేసుకుని ఉండడం మీరు చూడొచ్చు.. సినిమా సీన్లను తలపించేలా అవి రెండు పోటాపోటీగా పడుతూ గాల్లోకి లేస్తూ అద్భుతమైన నృత్యాలు చేస్తున్నాయి. ఆ పాముల వేగంతో పాటు వాటి శరీర కదలికలు చూస్తే వారికి ఒకవైపు భయాన్ని.. మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. జనావాసాలకు దూరంగా ఒక రోడ్డుపై ఈ రెండు సార్లు తమ లోకంలో తాము విహరిస్తూ ఈ విన్యాసాలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది.. సైన్స్ చెబుతుంది ఇదే.. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలను చూసి నాగ నృత్యం లేదా పాముల శృంగారమని భావిస్తూ ఉంటారు.. కానీ వన్యప్రాణి నిపుణుల ప్రకారం.. ఇది శృంగారం కాదు.. రెండు మగ
పాముల మధ్య ఆధిపత్యం కోసం జరిగే పోరాటమని.. తమ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి లేదా వేరే ఇతర ఆడ పాముల కోసం రెండు మగ పాములు ఇలా పరస్పరం తలపడుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు పాములు కూడా ఏదో కావాలని పరస్పరం.. తలపడుతున్నాయని మీరు గమనించవచ్చు..
నెటిజన్ల కామెంట్ల వర్షం.. ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడున్న కొందరు తమ స్మార్ట్‌ఫోన్స్‌లో బంధించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధి కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.. నా జీవితంలో ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూడలేదని.. ఒకరు కామెంట్ చేయగా.. అవి అంత ప్రమాదకరమైన వైనా.. చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయని మరికొందరు కామెంట్లు పెడుతూ వస్తున్నారు. మరి కొంతమంది అయితే, అటువైపు వెళ్తే ప్రాణాలు పోతాయి అంటూ చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియోని చూసి చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.