
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రాత్రి 7: 00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాక్ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. శనివారం ప్రాక్టీస్ సెషన్లో ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు గాయమైంది. స్పోర్ట్స్ డెస్క్: మహిళా టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ(ఆదివారం) హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా గ్రూపు-ఎ మ్యాచ్‌లో భాగంగా దాయాదీ దేశాలైన భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:00 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే పాక్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. నిన్న(శనివారం) ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా గాయపడింది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, యువ బ్యాటర్ ఆయేషా జాఫర్ కొట్టిన షాట్ నేరుగా ఫాతిమా సనా కుడి మోకాలికి తగిలింది. దీంతో ఆమె తీవ్రమైన నొప్పితో నేలపై పడి విలవిల్లాడింది. వెంటనే ఫిజియో వచ్చి సనాకు చికిత్స అందించాడు. కాసేపటి తర్వాత ప్రాకిస్ట్ చేయకుండానే ఆమె నెట్స్ నుంచి వెళ్లిపోయింది. ఫాతిమా తిరిగి ప్రాక్టీస్‌కు రాలేదు. కానీ దాదాపు గంట తర్వాత ఫాతిమా అటు ఇటు నడుస్తూ గ్రౌండ్లో కనిపించింది. ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఫాతిమా సనాకు తన గాయం గురుంచి విలేకరులు ప్రశ్నించారు. అది అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమేని, తన సహచర ప్లేయర్ ఆయేషా ఆడిన షాట్ మోకాలికి తగిలిందని తెలిపింది. కొంచెం నొప్పి తగ్గిందని, మ్యాచ్ ప్రారంభమయ్యే సరికి పూర్తిగా కోలుకుంటానని ఆశిస్తున్నానట్లు ఫాతిమా పేర్కొంది. ఒకవేళ భారత్‌తో మ్యాచ్‌కు ఫాతిమా దూరమైతే వికెట్ కీపర్ మునీబా అలీ జట్టును నడిపించే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. చరిత్ర సృష్టించిన టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రోహిత్ శర్మ రనౌట్‌పై స్పందించిన శుభ్‌మన్ గిల్