
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Sonam Wangchuk speech in Cockroach Janta Party protest at indira park: దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనాతా పార్టీకి ఏ రెంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఒక కేసు విచారణలో నిరుద్యోగుల్ని సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చడంతో.. గంటల వ్యవధిలోనే కాక్రోచ్ జనాతా పార్టీ పుట్టుకొచ్చింది. ఆ తర్వాత దేశంలోని ప్రధాన పార్టీల సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను వెనక్కి నెట్టేసి మరీ అభిజిత్ దిప్కే రంగంలోకి దించిన కాక్రోచ్ జనాతా పార్టీ ఒక బిగ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనాతా పార్టీ హవా కొనసాగుతుంది. అయితే.. ఇటీవల నీట్ పేపర్ లీకేజీ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు దిగింది. ఈ కార్యక్రమంకు పెద్ద ఎత్తున కాక్రోచ్ జనాతా పార్టీ సానుభూతి పరులు, నిరుద్యోగ అభ్యర్థులు హజరయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం జిందాబాద్ అంటూ నినదిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం
నెలకొంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త, సోనమ్ వాంగ్‌చుక్ పాల్గొని నిరుద్యోగులు, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల్లో మరింత జోష్ ను నింపారు.
సామాజిక వేత్త సోనమ్ వాంగ్ చూక్ మాట్లాడుతూ.. మీరు పోరాడండి, నేను మీతో ఉన్నానని నిరసన కారులు, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల్లో జోష్ ను నింపారు. యువత దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, తనలాంటివారు మార్గనిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి అవ్వాలనో, కొత్త పార్టీ పెట్టాలనో మాకు ఎలాంటి కోరిక లేదని తెల్చి చెప్పారు. ఇది కేవలం యువతను మేల్కొల్పే ఉద్యమం మాత్రమేనంటూ క్లారిటీ ఇచ్చారు. CJP ఒక స్వచ్ఛమైన వేదిక అనిపేర్కొన్నారు. రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చే వేదికలా మాత్రం ఉపయోగపడే వేదిక కాదన్నారు.
ఇది ప్రజలలో చైతన్యం తెచ్చే ఒక పవిత్రమైన ప్రయత్నమన్నారు. పేపర్ లీకులు, పరీక్షల రద్దు వంటి సమస్యలకు ఇకనైన ముగింపు పలకాలన్నారు. తప్పు జరిగినప్పుడు మంత్రి అయినా, ప్రధాని అయినా జవాబుదారీగా ఉండాలని తెల్చి చెప్పారు.
విద్యను కేవలం పరీక్షలకే పరిమితం చేయకుండా, విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది భవిష్యత్తు కోసం బలమైన పునాది వేయాగలగాలని పేర్కొన్నారు. అంతే కాకుండా.. పర్యావరణ పరిరక్షణ కూడా అత్యంత ముఖ్యమన్నారు. రాబోయే తరాలకు విద్య ఎంత అవసరమో... శ్వాసించడానికి స్వచ్ఛమైన గాలి, తాగడానికి స్వచ్ఛమైన నీరు కూడా అంతే ముఖ్యమన్నారు.
కేబిఆర్ పార్క్ పరిరక్షణ కోసం హైదరాబాద్ ప్రజలు చేసిన ప్రచార కార్యక్రమాలు, భూమిని, నదులను కాపాడుకోవడానికి వారు నిలబడిన తీరు దేశానికే ఆదర్శమని వాంగ్ చూక్ అన్నారు.
కాంక్రీట్ జంగల్స్ సంతోషాన్ని ఇవ్వవని పేర్కొన్నారు. అడవులను నరికివేసి, కాంక్రీట్ భవనాలు, ఫ్లైఓవర్లు నిర్మిస్తే ప్రజలు సంతోషిస్తారనే తప్పుడు నమ్మకంలో ప్రభుత్వాలు ఉన్నాయని ఆందోళనలు వ్యక్తం చేశారు. కానీ ఇవి మన పిల్లల భవిష్యత్తును కాపాడలేవన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే... మన అడవులను, నదులను కాపాడుకోవడానికి ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి గొంతు విప్పినప్పుడే విజయం సాధ్యమవుతుందన్నారు.
దీర్ఘకాలంలో విద్య, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే... స్వల్పకాలంలో మనకు ముందుగా ఒక క్రియాశీలకమైన, నిజాయితీగా పనిచేసే ప్రజాస్వామ్యం కావాలన్నారు. ముక్త్ భారత్ లక్యంగా కాక్రోచ్ జనతా పార్టీ పని చేస్తోందన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్నాయని, రెండు పార్టీలు అధికారంలో ఉన్న కూడా నిరుద్యోగం బాగా పెరిగి పోయిందని వాంగ్ చూక్ ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వాల తీరు వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డున పడ్డారని అన్నారు. పోటీ పరీక్షల పేపర్లు లీకేజీలు, తాజాగా నీట్ పేపర్ కూడా లీక్ వ్యవహరంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Read more: Telangana Rains: తెలంగాణలో ఆదివారం కుండపోత వర్షం.. ఈ జిల్లాలకు భారీ అలర్ట్
నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన కాక్రోచ్ జనతా పార్టీ నిలబడుతుందన్నారు. లడక్ లో కాక్రోచ్ సభ సెక్స్ స్ అయిందన్నారు. కాక్రోచ్ ఉద్యమం దేశంలో ఉవ్వెత్తున ఎగిసిందని, తెలంగాణ లో కూడా సక్సెస్ చేసినందుకు మీకు అందరికి ధన్యవాదాలని వాంగ్ చూక్ చెప్పుకొచ్చారు. నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికైన కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.