
పల్నాడు జిల్లా కోనూరు వద్ద కృష్ణా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. 10 మంది బంధువులు కలిసి నదిలో విహారయాత్రకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో పడవ బోల్తా పడటంతో అందరూ నీటమునిగారు. వారిలో ఆరుగురిని గ్రామస్థులు కాపాడారు. గల్లంతైన మరో నలుగురి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణా నదిలో పడవ బోల్తా.. నలుగురు గల్లంతు
|