
Ayatollah Ali Khamenei: ఇరాన్ దేశాన్ని దశాబ్దాల పాటు నడిపించిన మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల ప్రణాళికను ఆ దేశ ప్రభుత్వ మీడియా ఆదివారం ప్రకటించింది. ఖమేనీ సంస్మరణ కార్యక్రమాల నిర్వహణ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే నెల (జూలై) 4వ తేదీ నుంచి రాజధాని టెహ్రాన్‌లో అంతిమ సంస్కారాల ప్రక్రియ ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ కార్యక్రమం మార్చి నెలలోనే జరగాల్సి ఉన్నప్పటికీ, దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చింది. Read also: G7 సదస్సులో మోదీ-ట్రంప్ సమావేశం..అధికారిక ప్రకటన చేసిన వైట్ హౌస్ అధికారిక షెడ్యూల్ ప్రకారం.. జూలై 4, 5 తేదీలలో టెహ్రాన్‌లోని ప్రసిద్ధ ఇమామ్ ఖమేనీ ముసల్లా ప్రార్థనా మందిరంలో ఖమేనీ భౌతికకాయానికి ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం వీడ్కోలు సభలు నిర్వహిస్తారు. అనంతరం జూలై 6, 7 తేదీలలో రాజధాని టెహ్రాన్‌తో పాటు పవిత్ర నగరమైన కోమ్ (Qom) లలో భారీ ఎత్తున అంతిమ యాత్రలు (Funeral Processions) సాగుతాయి. జూలై 9వ తేదీన దేశ ఈశాన్య దిశలోని మషద్ (Mashhad) నగరంలో తుది వీడ్కోలు కార్యక్రమం ముగుస్తుంది. అదే రోజున షియా ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఎనిమిదో ఇమామ్ ‘ఇమామ్ రెజా’ పవిత్ర క్షేత్ర ప్రాంగణంలో ఖమేనీ పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు. 86 సంవత్సరాల వయసున్న అలీ ఖమేనీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడులలో మరణించారు. ఈ దాడులతో ఇరాన్ దేశంపై ఆయన సాగించిన 36 ఏళ్ల సుదీర్ఘ లీడర్షిప్ పాలనకు ముగింపు పడింది. ఈ వైమానిక దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, మనవడు, అల్లుడు సహా మరో నలుగురు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ మరణానంతరం, మార్చి మొదటి వారంలో ఆయన కుమారుడు మొజ్తబా
ఖమేనీ ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
G7 సదస్సులో మోదీ-ట్రంప్ సమావేశం..అధికారిక ప్రకటన చేసిన వైట్ హౌస్
Lyaki Freedom Ship Attack: ‘లియాకి ఫ్రీడమ్’ నౌకపై దాడి జరగలేదు.. విదేశాంగ శాఖ స్పష్టత
Indian passport and visa in UAE : యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్, వీసా సేవల్లో భారీ మార్పులు!
Iran Rejects Trump Allegation : అమెరికా దాడిలోనే భారతీయులు మృతి..ఇరాన్ సంచలన ప్రకటన
Iran-America War: అణ్వాయుధాలు తయారు చేయం: అమెరికా-ఇరాన్ చర్చల్లో చారిత్రాత్మక పురోగతి!
US House of Representatives: అమెరికా ప్రతినిధుల సభలో భారత టెక్ దిగ్గజం సోమశేఖర్‌కు గౌరవం