
ఇంటర్నెట్ డెస్క్: హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda) సొంతూరిపై ఉన్న మమకారాన్ని చేతల్లో చూపించారు. ఇటీవల సతీమణి రష్మికతో కలిసి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటలో ఇంటిలోకి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ గల విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ హామీని ఆయన తాజాగా నెరవేర్చారు. ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో అచ్చంపేట డివిజన్లోని విద్యార్థుల ‘మెరిట్ స్కాలర్షిప్ అవార్డీస్’ జాబితాను విడుదల చేశారు. ఇందులో మొత్తం 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి ఈ ఉపకారవేతనాలు అందజేయనున్నారు. ఆయన స్వగ్రామంలోని జడ్పీహెచ్ఎస్ తుమ్మన్‌పేట పాఠశాల నుంచి 9వ తరగతిలో బి. హేమలత (1వ ర్యాంక్), పి. ప్రణీత (2వ ర్యాంక్) ఎంపికయ్యారు. అలాగే 10వ తరగతిలో కె. గణేష్ (1వ ర్యాంక్), బి. అనిల్ (2వ ర్యాంక్) ఈ స్కాలర్షిప్ సాధించారు. నాడు ఇచ్చిన మాట నెరవేర్చినందుకు గ్రామస్థులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపకారవేతనానికి ఎంపికైన విద్యార్థులు వీళ్లే.. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.