
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. IND W vs PAK W: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మహిళల జట్లు తలపడనున్నాయి. బర్మింగ్‌హామ్‌లోని ప్రసిద్ధ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో గ్రూప్-1 లోని రెండు చిరకాల ప్రత్యర్థులు.. భారత్, పాకిస్తాన్ మహిళల జట్లు తలపడనున్నాయి. రెండు జట్లకు కూడా ఈ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే.. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. పాకిస్తాన్‌పై టీమిండియా స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు తలపడగా.. టీమిండియా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పాక్ కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు టాస్ వేయనున్నారు. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను మన భారత్‌లో 'స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్' ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. ఇక ఫోన్లో ఈ మ్యాచ్‌ను 'జియోహాట్‌స్టార్' యాప్ ద్వారా లైవ్‌లో వీక్షించవచ్చు. భారత్ తుది జట్టు అంచనా.. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, భారతి ఫుల్మాలి, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, నందిని శర్మ. పాకిస్తాన్ తుది జట్టు అంచనా
.. మునీబా అలీ (వికెట్ కీపర్), గుల్ ఫెరోజా, అలియా రియాజ్, అయేషా జాఫర్, ఫాతిమా సనా (కెప్టెన్), ఇరామ్ జావేద్, నటాలియా పర్వైజ్, తూబా హసన్, డయానా బేగ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.