ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియం సాక్షిగా టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఆఫ్ఘానిస్థాన్‌తో తొలి వన్డేలో హిట్‌మ్యాన్ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా 16,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు.
ఓవరాల్‌గా చూస్తే.. ఈ ఫీట్ సాధించిన ఏడో ప్లేయర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు.ఆఫ్ఘానిస్థాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో రోహిత్ శర్మ ఈ రికార్డును అందుకున్నాడు. ఒమర్జాయ్ వేసిన బ్యాక్ ఆఫ్ ద లెంగ్త్ డెలివరీని రోహిత్ శర్మ తనదైన శైలిలో అద్భుతమైన ఫుల్ షాట్‌తో స్క్వేర్ లెగ్ స్టాండ్స్‌లోకి భారీ సిక్సర్‌గా మలిచాడు.
ఈ సిక్సర్‌తోనే ఓపెనర్‌గా 16 వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని దాటేశాడు. ప్రపంచ క్రికెట్లో ఓపెనర్‌గా వచ్చి ఈ స్థాయిలో పరుగులు సాధించిన అతికొద్ది మంది దిగ్గజాల సరసన హిట్‌మ్యాన్ చేరిపోయాడు. టీమిండియా తరఫున ఈ ఫీట్‌ను మొట్ట మొదటి సారి డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సాధించాడు.ఇదే మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ మరో రికార్డు సైతం సాధించాడు.
టీమిండియా తరఫున వన్డే మ్యాచ్ ఆడిన అత్యధిక వయస్కుడిగాను రికార్డు క్రియేట్ చేశాడు. అంతకు ముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్, 1983 వన్డే ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు మొహిందర్ అమర్నాథ్ పేరిట ఉంది. ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన కెరీర్లో చివరి వన్డే మ్యాచ్ ఆడారు.
తాజాగా రోహిత్.. 39 ఏళ్ల 44 రోజుల వయసులో బరిలోకి దిగి.. దాన్ని అధిగమించాడు.రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఇప్పటివరకు 359 మ్యాచుల్లో 45.35 అదిరిపోయే సగటుతో 16,009* రన్స్ చేశాడు. ఇందులో 45 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ఓపెనర్‌గా ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ వీరేంద్ర సెహ్వాగ్ (16,119) పేరిట ఉంది.
ఆ రికార్డుకు కేవలం 110 పరుగుల దూరంలోనే ఉన్నాడు. త్వరలోనే అతడు ఈ రికార్డు కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది.
రోహిత్