
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో, ఆఫ్ఘన్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (84 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించగా, కేఎల్ రాహుల్ (39 నాటౌట్) తన మెరుపు బ్యాటింగ్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు మంచి ఆరంభం లభించింది.
రోహిత్ శర్మ (16) వేగంగా ఆడినా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (34) దూకుడుగా ఆడి స్కోరు బోర్డును నడిపించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒకవైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో ఆడి, 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
చివర్లో కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి, మరో 13 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, జియా ఉర్ రెహ్మాన్ చెరో వికెట్ తీశారు.అంతకుముందు, టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలినా, ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (102) ఆకాశమే హద్దుగా చెలరేగాడు
.