
విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో వైద్యారోగ్య రంగాన్ని కొత్త పుంతలు తొక్కించామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ సేవలను గణనీయంగా మెరుగుపరిచాం. యూనివర్సల్ హెల్త్ స్కీమ్, సంజీవని వంటి పథకాలను ప్రవేశపెట్టాం. సిబ్బంది హాజరు శాతాన్ని అదనంగా 28 శాతానికి పెంచాం. అనధికారికంగా గైర్హాజరవుతున్న 51 మంది వైద్యులను తొలగించాం. ఆసుపత్రుల్లో సర్జరీలను 37 శాతం వరకూ పెంచాం. రెండేళ్లలో 29 లక్షల మంది ఆరోగ్యశ్రీ సేవలు పొందారు. రెండేళ్లలో 1,210 మంది వైద్యులను కొత్తగా నియమించాం. పీజీ, ఎంబీబీఎస్ వైద్య సీట్లను గణనీయంగా పెంచాం. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు, కార్పొరేట్‌కు దీటుగా తయారు చేస్తున్నాం. వైద్యారోగ్య శాఖలో పారదర్శకంగా బదిలీలు నిర్వహిస్తున్నాం’’ అని చెప్పారు. అంతకుముందు కేఎల్ వర్సిటీలో నిర్వహించిన ఐఏపీ నియోకాన్ జాతీయ సదస్సులో మంత్రి సత్యకుమార్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శిశుమరణాల రేటును రెండేళ్లలో 46.8 నుంచి 36కు, మాతృ మరణాల రేటును 46 నుంచి 20కు తగ్గించామని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో బీటెక్ ప్రవేశాల ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. పెట్టుబడుల సాధన, రాజధానిలో అత్యాధునిక పద్ధతుల్లో నిర్మాణాలు బెస్ట్ ప్రాక్టీసెస్ అన్వయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి
చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు.
తిరుపతి జిల్లా తడ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు దగ్ధమైంది.