టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. టీమిండియా తరఫున వన్డే మ్యాచ్ ఆడిన అత్యధిక వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. అఫ్ఘానిస్థాన్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే మోహిందర్ అమర్నాథ్ను అధిగమించాడు.గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ ప్లేయర్, 1983 వన్డే ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు మొహిందర్ అమర్నాథ్ పేరిట ఉంది. ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన కెరీర్లో చివరి వన్డే మ్యాచ్ ఆడారు. తాజాగా ఈ రికార్డును హిట్‌మ్యాన్ అధిగమించాడు. అఫ్ఘానిస్థాన్‌తో ధర్మశాలలో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్.. 39 ఏళ్ల 44 రోజుల వయస్సుతో బరిలోకి దిగాడు. 2007లో టీమిండియా తరపున తొలి మ్యాచ్ ఆడిన రోహిత్.. 19 ఏళ్లుగా జట్టులో కొనసాగుతున్నాడు.2007లో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. కెరీర్లో తొలి నాలుగైదేళ్లు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2007 విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న అతడు.. ఆ తర్వాత అవకాశాలు కోల్పోయాడు. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ 2011లో జట్టులో చోటు దక్కించుకోలేక నిరాశకు లోనయ్యాడు. ఈ సమయంలో ధోనీ నిర్ణయం రోహిత్ కెరీర్‌ను మలుపుతిప్పింది. అప్పటివరకూ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే.. హిట్‌మ్యాన్‌ను.. ధోనీ ఓపెనర్‌గా బరిలోకి దించాడు. ఇక అప్పటి నుంచి అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. కీలక ఆటగాడిగా మారడంతో పాటు.. టీమిండియా మేటి కెప్టెన్లలో ఒకడిగా రికార్డు క్రియేట్ చేశాడు.వన్డే ప్రపంచకప్ 2023 భారత్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నా రోహిత్ మాత్రం తన నాయకత్వ లక్షణాలతో అదరగొట్టాడు. తన సారథ్యంలో టీమిండియాకు టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ అందించాడు. టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే
ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027లో ఆడటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు. వన్డే ప్రపంచకప్ టైటిల్ కల నెరవేరాలంటే రోహిత్ శర్మకు.. వచ్చే 18 నెలలు కీలకం కానుంది.