
నోరులేని మూగజీవాల సంక్షేమం విషయంలో కోర్టులు మూగప్రేక్షకుడిలా కూర్చోలేవని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేరళలోనే అత్యంత ఎత్తైన ఏనుగుగా పేరొందిన రామన్ కస్టడీ వివాదంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను, దాని ప్రస్తుత సంరక్షకుడిని తప్పుబడుతూ న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. ఏనుగును తక్షణమే కేరళ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని, పునరావాస కేంద్రానికి తరలించాలని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.మూగజీవాల సంక్షేమమే మాకు ముఖ్యం!కోర్టుకు ఇచ్చిన హామీని బేఖాతరు చేస్తూ రామన్ను వాణిజ్య, ఆలయ ఉత్సవాలకు ఉపయోగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కేరళలోనే అత్యంత ఎత్తైన ఏనుగు అయిన రామన్ను కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాణిజ్యపరంగా వాడుకోవడం నిజంగా దురదృష్టకరం. కోర్టుకు ఇచ్చిన అండర్ టేకింగ్ను సైతం పక్కనబెట్టి ఇలా ప్రవర్తించడం సరికాదు. నోరులేని ప్రాణుల సంక్షేమం మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ఇలాంటి ఉల్లంఘనలు జరుగుతుంటే మేము కళ్ళు మూసుకుని కూర్చోలేము, అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.అసలేమిటీ వివాదం?రామన్ అనే ఏనుగు యాజమాన్య హక్కులపై గత కొంతకాలంగా జయకృష్ణ మీనన్, కృష్ణన్కుట్టి అనే ఇద్దరి మధ్య సుదీర్ఘ వివాదం నడుస్తోంది. ఈ ఏనుగు మాతా అమృతానందమయి మఠంకు చెందినదని, కేవలం చూసుకోవడానికే కృష్ణన్కుట్టికి ఇచ్చారని జయకృష్ణ మీనన్ వాదిస్తున్నారు. అయితే 2017లో జరిగిన గిఫ్ట్ డీడ్స్ (బహుమతి పత్రాల) ప్రకారం ఈ ఏనుగు తనదేనని కృష్ణన్కుట్టి చెబుతున్నారు. ఈ కస్టడీ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది.జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? కోర్టు హామీని తుంగలో తొక్కి..ఈ కేసు విచారణలో భాగంగా గత ఏడాది (ఆగస్టు 6, 2025న) సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏనుగు ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించడంతో పాటు.. కేసు తేలేవరకు ఏనుగును ఎలాంటి ఆలయ ఉత్సవాలకు, కమర్షియల్ కార్యక్రమాలకు వాడబోమని కృష్ణన్కుట్టి
నోరులేని మూగజీవాల సంక్షేమం విషయంలో కోర్టులు మూగప్రేక్షకుడిలా కూర్చోలేవని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేరళలోనే అత్యంత ఎత్తైన ఏనుగుగా పేరొందిన రామన్ కస్టడీ వివాదంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను, దాని ప్రస్తుత సంరక్షకుడిని తప్పుబడుతూ న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. ఏనుగును తక్షణమే కేరళ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని, పునరావాస కేంద్రానికి తరలించాలని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.మూగజీవాల సంక్షేమమే మాకు ముఖ్యం!కోర్టుకు ఇచ్చిన హామీని బేఖాతరు చేస్తూ రామన్ను వాణిజ్య, ఆలయ ఉత్సవాలకు ఉపయోగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కేరళలోనే అత్యంత ఎత్తైన ఏనుగు అయిన రామన్‌ను కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాణిజ్యపరంగా వాడుకోవడం నిజంగా దురదృష్టకరం. కోర్టుకు ఇచ్చిన అండర్ టేకింగ్‌ను సైతం పక్కనబెట్టి ఇలా ప్రవర్తించడం సరికాదు. నోరులేని ప్రాణుల సంక్షేమం మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ఇలాంటి ఉల్లంఘనలు జరుగుతుంటే మేము కళ్ళు మూసుకుని కూర్చోలేము, అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.అసలేమిటీ వివాదం?రామన్ అనే ఏనుగు యాజమాన్య హక్కులపై గత కొంతకాలంగా జయకృష్ణ మీనన్, కృష్ణన్‌కుట్టి అనే ఇద్దరి మధ్య సుదీర్ఘ వివాదం నడుస్తోంది. ఈ ఏనుగు మాతా అమృతానందమయి మఠంకు చెందినదని, కేవలం చూసుకోవడానికే కృష్ణన్‌కుట్టికి ఇచ్చారని జయకృష్ణ మీనన్ వాదిస్తున్నారు. అయితే 2017లో జరిగిన గిఫ్ట్ డీడ్స్ (బహుమతి పత్రాల) ప్రకారం ఈ ఏనుగు తనదేనని కృష్ణన్‌కుట్టి చెబుతున్నారు. ఈ కస్టడీ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? కోర్టు హామీని తుంగలో తొక్కి..ఈ కేసు విచారణలో భాగంగా గత ఏడాది (ఆగస్టు 6, 2025న) సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏనుగు ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించడంతో పాటు.. కేసు తేలేవరకు ఏనుగును ఎలాంటి ఆలయ ఉత్సవాలకు, కమర్షియల్ కార్యక్రమాలకు వాడబోమని కృష్ణన్‌కుట్టి తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.బ్రహ్మం గారు చెప్పిందే మళ్లీ నిజమైందా ? పంది కడుపున ఏనుగు పిల్ల జననం ??కానీ, ఫిబ్రవరి 3, 2026న అధికారులు తనిఖీలు చేయగా.. రామన్ను చావక్కాడ్‌లోని ఒక గుడి ఉత్సవానికి తరలించినట్లు తేలింది. వేరే ఏనుగుకు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే, భక్తుల సెంటిమెంట్‌ను గౌరవించి రామన్‌ను తీసుకెళ్లామని, ఇందులో ఎలాంటి వాణిజ్య కోణం లేదని కృష్ణన్‌కుట్టి కోర్టుకు వివరణ ఇస్తూ బేషరతు క్షమాపణలు కోరారు. అయితే, ఈ సాకులను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కోర్టుకు ఇచ్చిన మాటను తప్పి, ఏనుగును ఊరేగింపులకు వాడటం ముమ్మాటికీ ఉల్లంఘనేనని తేల్చిచెప్పింది.ప్రభుత్వ కస్టడీకి ఏనుగు.. యజమానికి జరిమానాఈ నేపథ్యంలో ఏనుగు సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏనుగు రామన్‌ను కేరళ ప్రభుత్వం వెంటనే తన ఆధీనంలోకి తీసుకుని, తగిన రెస్క్యూ లేదా పునరావాస కేంద్రంలో ఉంచాలని ఆదేశించింది. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 1972 ప్రకారం ప్రభుత్వమే తన సొంత ఖర్చులతో ఏనుగును చూసుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఈ ఏర్పాటు తాత్కాలికమేనని, కేసు తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు గాను కృష్ణన్‌కుట్టిని దోషిగా తేల్చి, రూ. 2,000 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా డిపాజిట్ చేయాలని ఆదేశించింది.ఏనుగు మదపు ఏనుగు (ముస్త్) స్థితిలో ఉండటం వల్లే సకాలంలో వైద్య పరీక్షలు చేయలేకపోయామన్న అటవీ అధికారుల వివరణను కోర్టు అంగీకరించింది. వారు తనిఖీల కోసం ప్రయత్నించారని గుర్తిస్తూ అధికారులపై ఉన్న కోర్టు ధిక్కరణ ఆరోపణలను కొట్టివేసింది.