
Drugs | ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జూన్ 26, 2026న నిర్వహించనున్న “యాంటీ డ్రగ్ 3కే రన్” కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువతను లక్ష్యంగా చేసుకుని సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల వ్యసనం దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ దుర్వినియోగంపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు ఐఎంఏ జగిత్యాల చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. సమాజంలో ఆరోగ్యకరమైన జీవన విధానాలను ప్రోత్సహించేందుకు వైద్యులు ముందుకు రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. “రన్ స్ట్రాంగ్ – లివ్ ఫ్రీ, సే నో టు డ్రగ్స్” అనే నినాదంతో నిర్వహించనున్న ఈ 3కే రన్ పాత బస్టాండ్ దగ్గర లోని శ్రీ వివేకానంద మినీ స్టేడియం నుండి ఐఎంఏ భవన్ వరకు జరగనుంది. విద్యార్థులు, యువత, వైద్యులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాన్ని సమాజానికి చాటాలని ఆయన పిలుపునిచ్చారు.. డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ అవగాహన పరుగు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సంకల్పిద్దామని వారు పిలుపునిచ్చింది. ఈ యాంటీ డ్రగ్ 3కే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జగిత్యాల కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి, కోశాధికారి డాక్టర్ కోటగిరి సుధీర్ కుమార్, డాక్టర్ వడ్లూరి శ్రవణ్ కుమార్, డాక్టర్ బండెల విజయ్ , డాక్టర్ ఇనుగురతి రాజశేఖర్ పాల్గొన్నారు. Towel Dance | ఫారెన్
రోడ్లపై యువతి టవల్ డ్యాన్స్.. భారతీయుల పరువు తీస్తున్నారని నెటిజన్ల ఫైర్
Aashirwad: 87 బంతుల్లో 103 రన్స్.. రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ సోదరుడు
Ram Charan| రామ్ చరణ్‌కు సర్జరీ .. RC17 మరింత ఆలస్యం కానుందా, ఆందోళనలో మెగా ఫ్యాన్స్!