
హైదరాబాద్లో ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేక సంఘటనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి బైక్ నడుపుతూ పెట్రోల్ ట్యాంక్ మీద ల్యాప్టాప్ పెట్టుకుని ఆఫీసు పనులు చేసుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ ప్రమాదకర చర్యను వర్క్ ఫ్రమ్ బైక్ అని పిలుస్తున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఈ వీడియోను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్లపై ఇలా చెయ్యొద్దు అన్న సజ్జనార్ బైక్ను నడుపుతూ ఏకాగ్రతతో పని చేయడం అసాధ్యం. ఒక్క క్షణం ఏకాగ్రత తప్పినా ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇతర వాహనదారులు మరియు పాదయాత్రీకుల భద్రతకు కూడా తీవ్ర ముప్పు కలిగిస్తుందని సజ్జనార్ స్పష్టం చేశారు. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. రోడ్లపై ఇలాంటి పనులు చేయవద్దు అని హెచ్చరించారు.ఇలాంటి పనులు చేయడం బాధ్యతారాహిత్యం సజ్జనార్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ, కార్పొరేట్ డెడ్లైన్లు, పని ఒత్తిళ్లు ఎంత ఉన్నా ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి పనులు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. కడుపు నింపుకోవడానికి చేసే ఉద్యోగం కడతేర్చేలా ఉండకూడదు అని ఉద్యోగులకు సలహా ఇచ్చారు. పాత సామెత ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదికి వస్తుంది అన్న వాక్యాన్ని ఉదహరించి ప్రమాదాలను గుర్తు చేశారు.యువతను తప్పుదోవ పట్టించేలా కొందరి తీరు ఉందన్న సజ్జనార్ హైదరాబాద్ ఐటీ కారిడార్ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయని, యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. బైక్ లేదా కారులో ప్రయాణించేటప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేయడం, ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడటం వంటి చర్యలు పూర్తిగా మానేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వాహనదారుడూ తన కుటుంబం కోసం సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.బైకర్పై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్నెటిజన్లు కూడా ఈ వీడియోను ఖండిస్తూ, ఆ బైకర్పై ట్రాఫిక్ పోలీసులు కఠిన
హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేక సంఘటనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బైక్ నడుపుతూ పెట్రోల్ ట్యాంక్ మీద ల్యాప్‌టాప్ పెట్టుకుని ఆఫీసు పనులు చేసుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ ప్రమాదకర చర్యను వర్క్ ఫ్రమ్ బైక్ అని పిలుస్తున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఈ వీడియోను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్లపై ఇలా చెయ్యొద్దు అన్న సజ్జనార్ బైక్‌ను నడుపుతూ ఏకాగ్రతతో పని చేయడం అసాధ్యం. ఒక్క క్షణం ఏకాగ్రత తప్పినా ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇతర వాహనదారులు మరియు పాదయాత్రీకుల భద్రతకు కూడా తీవ్ర ముప్పు కలిగిస్తుందని సజ్జనార్ స్పష్టం చేశారు. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. రోడ్లపై ఇలాంటి పనులు చేయవద్దు అని హెచ్చరించారు.ఇలాంటి పనులు చేయడం బాధ్యతారాహిత్యం సజ్జనార్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ, కార్పొరేట్ డెడ్‌లైన్లు, పని ఒత్తిళ్లు ఎంత ఉన్నా ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి పనులు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. కడుపు నింపుకోవడానికి చేసే ఉద్యోగం కడతేర్చేలా ఉండకూడదు అని ఉద్యోగులకు సలహా ఇచ్చారు. పాత సామెత ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదికి వస్తుంది అన్న వాక్యాన్ని ఉదహరించి ప్రమాదాలను గుర్తు చేశారు.యువతను తప్పుదోవ పట్టించేలా కొందరి తీరు ఉందన్న సజ్జనార్ హైదరాబాద్ ఐటీ కారిడార్ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయని, యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. బైక్ లేదా కారులో ప్రయాణించేటప్పుడు ల్యాప్‌టాప్ ఓపెన్ చేయడం, ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడటం వంటి చర్యలు పూర్తిగా మానేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వాహనదారుడూ తన కుటుంబం కోసం సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.బైకర్‌పై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్నెటిజన్లు కూడా ఈ వీడియోను ఖండిస్తూ, ఆ బైకర్‌పై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ రోడ్లపై భద్రతా సమస్యలను మళ్లీ వెలుగులోకి తెచ్చింది.ఈ రకమైన ప్రమాదకర చర్యలు యువతలో పెరుగుతున్న ఒత్తిళ్లను సూచిస్తున్నాయి. కంపెనీలు కూడా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, సమయ నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ కు షాక్.. రూ.50వేల జరిమానా విధించిన హైకోర్టు!రోడ్డు భద్రత అందరి బాధ్యత రోడ్డు భద్రత అందరి బాధ్యత అని సజ్జనార్ హితవు పలికారు. హైదరాబాద్ పోలీసులు ఇలాంటి సంఘటనలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా రోడ్లపై జాగ్రత్తగా ఉండి, ఇతరులను కూడా అప్రమత్తం చేయాలని విజ్ఞప్తి చేశారు.