
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5 నిర్మాణ సంస్థలు : వైజయంతి మూవీస్, స్వప్న సినిమా నటీ నటులు : అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి, తులసి PA, బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ తదితరులు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: సంకల్ప్ గోరా, సినిమాటోగ్రఫీ : అంకుర్ సి రచయితలు: సింగీతం శ్రీనివాసరావు, గౌతమి చల్లగుల్లా, శశాంక్, శ్రీకర్, నంద కిషోర్ ఈమని, రాహుల్ వి రాజేశ్వర్ ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్ నిర్మాత: నాగ్ అశ్విన్, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు విడుదల తేది : 12.06.2026 నిడివి :2 ఘంటల 20 నిముషాలు దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు. ఐకానిక్ మూకీ చిత్రం ‘పుష్పక్’ నుంచి విజనరీ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ ‘ఆదిత్య 369’ వరకు ఆయన క్రియేటివిటీకి పర్యాయపదంగా నిలిచారు. కమల్ హాసన్‌తో ఆయన చేసిన ‘విచిత్ర సహోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజన్’ బెంచ్ మార్క్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు, భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీగా లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’తో మన ముందుకు వచ్చారు . ఈ చిత్రం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, తన సంగీతం మ్యాజికల్ రియలిజంను మేళవించి ఓ యూనిక్ అనుభూతితో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్, ఒక దిగ్గజ దార్శనికుడిని, లెజండరీ నిర్మాణ సంస్థ కలగలసి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి జూన్ 12న ధియేటర్ ల లోకి వచ్చింది ‘సింగ్ గీతం’ మరి ఇంత క్రేజీ
ప్రాజెక్ట్ ఎలా వుందో సమీక్ష లో చూద్దాం.
కథ : ఆర్థిక మోసం కేసులో జైలు శిక్ష అనుభవించి భోపాల్ నుండి ఇష్టం లేకున్న జైలు నుంచి బయటకు నెట్టి వేయబడిన ప్రతాప్ (ఆయాన్) తన తండ్రి రాసిచ్చిన కొన్ని ఎకరాల భూమి పత్రాలు చేతికి దక్కిన ఆనందంతో తన ఆస్తుల దక్కించుకోవడానికి కుబేరపురంకు వెళ్తాడు. విచిత్రమైన మనషులు, వింత ప్రవర్తన మధ్య నైరోబి బిజినెస్‌మ్యాన్‌తో గోల్డ్ మైనింగ్ చేపట్టే ప్రయత్నంలో ఉన్న రేణు (షాలిని)ను ప్రతాప్ కలుసుకొంటాడు. తనను గ్రామస్థులంతా ఓ దేవుడిలా కోలవడం చూసి ప్రతాప్ ఆశ్చర్యంలో మునిగిపోతాడు. ఈ క్రమంలో తనకు అత్యంత సెంటిమెంట్‌గా భావించే భారీ వృక్షానికి రక్షణగా నిలిచిన గౌరీ (అహల్య)తో పరిచయం ఏర్పడుతుంది. అయితే ప్రతాప్, రేణు కలిసి మైనింగ్‌కు అడ్డుగా మారిన ఆ వృక్షాన్ని నేలమట్టం చేస్తారు. దాంతో గౌరీ మనస్తాపం చెంది గ్రామ దేవుడు కుబేరుడిని నిందించి ప్రశ్నిస్తుంది. దాంతో గ్రామస్థులందరికి దేవుడు ఓ శాపం పెడుతాడు.జైలు నుంచి కుబేరపురం గ్రామానికి వెళ్లిన ప్రతాప్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? గౌరీ, నైరోబీ మైనింగ్ మాఫియా మధ్య ఎలాంటి డీల్ కుదిరింది? ప్రతాప్ ఎలాంటి పరిస్థితుల్లో మైనింగ్ డీల్‌లో భాగమయ్యాడు? గౌరీ, ప్రతాప్ మధ్య పరిచయం ఎలాంటి బంధానికి దారి తీసింది? మైనింగ్ కోసం భారీ వృక్షాన్ని కూల్చివేయడంతో గౌరీ రియాక్షన్ ఏమిటి? గ్రామంలో ఉన్న ఏకైక వృక్షాన్ని ధ్వంసం చేయడంతో గౌరీ ఎలాంటి మనో వేదనకు గురైంది? గౌరీ ఆగ్రహంతో కుబేరుడు పెట్టిన శాపం ఏమిటి? ఆ శాపం వల్ల గ్రామస్థుల బిహేవియర్ ఎలా మారింది? ఆ శాపం ఊరి ప్రజలను ఎలాంటి ఆందోళనకు గురి చేసింది? గోల్డ్ మైనింగ్ వ్యవహారానికి ఎలాంటి ముగింపు కలిగింది? మహా వృక్షంతో గౌరీకి ఉన్న అనుబంధం వెనుక కథ ఏమిటి? చివర్లో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఆకట్టుకొన్నదా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
నటీనటుల హవబవాలు : అయాన్ ఎంతో ఎనర్జిటిక్ గా నటించాడు. అహిల్య కూడా అతనికి మంచి జోడీ అనిపించుకుంది. వీళ్ళకి కచ్చితంగా టాలీవుడ్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పాలి. సెల్ఫిష్ బిజినెస్ విమెన్ పాత్రలో షాలిని కూడా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అగు స్టేన్లీ భయంకరంగా కనిపించినప్పటికీ.. అతని కామెడీని అంతా ఎంజాయ్ చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నివేదా పేతురాజ్ కేమియో రోల్ కూడా చాలా బాగుంది. ఈ మధ్య తల్లి పాత్రలకి అంకితమైపోయి.. సినిమాల్లో ఓ మూలాన నిలబడే పాత్రలు చేస్తున్న తులసికి కూడా ఈ సినిమాలో మాత్రం పాత్ర దొరికింది. శివన్నారాయణ కూడా కొన్ని సన్నివేశాల్లో నటించారు. మహేష్ ఆచంట, బెనర్జీ, రచ్చ రవి వంటి వారు తమ పాత్రలకి న్యాయం చేశారు
సాంకేతిక వర్గం పనితీరు : సింగీతం గారి ఆలోచనకి దేవిశ్రీ ప్రసాద్ లాంటి ప్రయోగాత్మక సంగీత దర్శకుడు తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమా కథనం చూస్తే అర్ధం అవుతుంది. ఇలాంటి ఒక సినిమాని దాదాపు మాటల్ని సాహిత్యంతోనే నడిపించడం అందులోని అలరించే సంగీతంతో నడిపించడం అనేది ఖచ్చితంగా సాధారణ విషయం కాదు. దీనిని దేవిశ్రీ ప్రసాద్ చేసి చూపించారు. ఇంకా తన వర్క్ కోసం చెప్పాలంటే ప్రెజెంట్ కొనసాగుతున్న కొందరు టాప్ సంగీత దర్శకులు స్టైల్ లో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగలడు ఏమో కానీ ఇలాంటి సినిమాలకి దేవిశ్రీ ఇచ్చినలాంటి వర్క్ ని వారు ఇవ్వగలరా? ఇది ఒక్క డీఎస్పీకి మాత్రమే సాధ్యం అనేలా తన వర్క్ ఈ సినిమాలో ఉంది. ఈ చిత్రంలో నిర్మాణ విలువలకి ఎలాంటి వంకలు పెట్టడానికి లేదు. నాగ్ అశ్విన్ అండ్ టీం సినిమాకి ఎక్కడెక్కడ ఎంత కావాలో ఆ రేంజ్ లో ఖర్చు చేసి అవుట్ పుట్ పరంగా ఎక్కడా వెనకాడలేదు. అనుకూర్ సి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా డీసెంట్ అని చెప్పొచ్చు. సాహిత్యం, అందులోనే డైలాగులుతో నడిపించిన సాహిత్య బృందం అందరికీ ప్రత్యేక మెన్షన్ అందించాల్సిందే. ఇక దేవిశ్రీ ప్రసాద్, సింగీతం గార్ల కోసం పైన ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇద్దరి పౌనఃపుణ్యం సమాంతరంగా పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇక నిర్మాత నాగ్ అశ్విన్ కల్కి సినిమాకి ముందు నుంచే సింగీతం గారితో ప్రయాణంలో ఉన్నారు. ఆయనపై ప్రేమ, తన ఆలోచనకి తాను ఖర్చు పెట్టిన ప్రతీ పైసా వృధా పోలేదు.
తీర్పు : 94 ఏళ్ళ వయసు కలిగిన ఓ దర్శకుడు, 40 ఏళ్ళ క్రితం అనుకుని వదిలేసిన ఓ కథతో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు అంటే.. దానిపై ఎవ్వరికైనా హోప్స్ ఉంటాయా? ‘సింగ్ గీతం’ పై మొదటి నుండీ అందరిలో ఇవే అనుమానాలు కలిగాయి. అందులోనూ కమల్ హాసన్ వంటి స్టార్ తో అనుకుని పక్కన పెట్టేసిన కథ అంటే అవి ఇంకా రెట్టింపు అయ్యాయి. కానీ ఆ అనుమానాలను అన్నీ పటాపంచలు చేస్తూ ‘సింగ్ గీతం’ సినిమా అందరికీ ఓ సర్ప్రైజింగ్ ఫీల్ కలిగిస్తుంది అనేది వాస్తవం. ఈ టైంలో ఇది అతి పెద్ద ప్రయోగాత్మక సినిమా. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘సింగ్ గీతం’ అనే చిత్రం సింగీతం శ్రీనివాసరావు గారి నుంచి మరో వినూత్న విజయ ప్రయత్నం. 40 ఏళ్ల కితమే తనకి వచ్చిన ఈ ఆలోచన ఇప్పటికీ మెప్పించే విధంగా ఉంది అంటే ఆయన ఏ రీతి దర్శకుడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకి తగ్గట్టుగా పాటలు, సంగీతం ప్రధానంగా సాగిన ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ పనితనం కూడా మరో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచింది. నటీనటుల పెర్ఫామెన్స్ లు కూడా మరింత ప్లస్ అయ్యాయి. చిన్నపాటి పొరపత్యాలు ఉన్నాయి కానీ వాటిని మిగతా అంశాలు కప్పేస్తాయి. సో సింగీతం గారి మార్క్ విజన్ తో కూడిన అందమైన చందమామ కథ లాంటి సినిమా చూడాలి అనుకుంటే ఈ వారాంతంలో ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని వీక్షించవచ్చు.