
తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం PEDDI పేరు మార్మోగిపోతోంది..మొదటి వారం అద్భుతమైన వసూళ్లను సాధించిన ఈ చిత్రం, రెండో వారంలోనూ అదే దూకుడును ప్రదర్శిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒకానొక దశలో కలెక్షన్లు కాస్త స్లో అయ్యాయేమో అనుకునేలోపే, మళ్లీ పుంజుకుని బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. మిక్స్ టాక్ ఉన్నా కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయితే ప్రేక్షకులు థియేటర్లకు ఎలా బ్రహ్మరథం పడతారో ఈ సినిమా మరోసారి నిరూపించింది. రెండో వీకెండ్లో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’లో ఈ చిత్రం సృష్టిస్తున్న హవా అంతా ఇంతా కాదు. కేవలం గత ఒక్క గంటలోనే ఏకంగా 9.78 వేల టికెట్లు అమ్ముడయ్యాయంటే ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సగటున గంటకు దాదాపు 10 వేల టికెట్ల చొప్పున బుక్ అవుతూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది. వీకెండ్ కావడంతో ఈ నంబర్స్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి, ‘పెద్ది’ వసూళ్ల సునామీ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటూ, కలెక్షన్ల వర్షం కురిపిస్తూ లాంగ్ రన్ వైపు ఈ చిత్రం దూసుకెళ్తోంది
.