
Vijay : స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ గత కొన్నాళ్లుగా వైరల్ అవుతూనే ఉన్నారు, వార్తల్లో నిలుస్తున్నారు. కరెక్ట్ గా ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత విడాకులకు అప్లై చేస్తూ తన భర్తకు వేరే మహిళతో సంబంధం ఉందంటూ పిటిషన్ వేసింది. ఎప్పట్నుంచో త్రిష – విజయ్ గురించి వార్తలు రావడం, అప్పుడే ఇద్దరూ కలిసి ఓ పెళ్ళికి హాజరవ్వడం, సంగీత విడాకులు కోరడంతో విజయ్ – త్రిష రిలేషన్ వల్లే సంగీత విడాకులు కోరిందని అంతా భావించారు. ఎన్నికల తర్వాత విజయ్ సీఎం అవ్వడం, త్రిష విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరవ్వడం, విజయ్ ఇంటికి వెళ్లడం, విజయ్ ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండటం, అజిత్ ఇంటికి ఇద్దరూ కలిసి వెళ్లడంతో విజయ్ కి విడాకులు రాగానే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. సంగీత విడాకులకు అప్లై చేసి లండన్ వెళ్ళిపోయింది. అయితే తాజాగా విజయ్ – సంగీత మళ్ళీ కలిసిపోతారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ మీడియా సమాచారం ప్రకారం.. విజయ్ సీఎం అవ్వడంతో విజయ్ రాజకీయ భవిష్యత్తు, కుటుంబాల ప్రాముఖ్యత, విజయ్ పిల్లలను దృష్టిలో ఉంచుకొని విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్ విజయ్ – సంగీత మధ్య సయోధ్య కుదిర్చిందని తెలుస్తుంది. ఇరు కుటుంబ సభ్యులు కూడా దీని గురించి చర్చించారని, సంగీత కూడా లండన్ నుంచి వచ్చి ఈ చర్చల్లో పాల్గొందని, విజయ్ – సంగీత మళ్ళీ కలిసిపోతారని సమాచారం. విడాకుల పిటిషన్ కూడా సంగీత వెనక్కి తీసుకుంటుందని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఇవి నిజమైతే మరి త్రిష పరిస్థితి ఏంటి అని నెటిజన్లు అడుగుతున్నారు. ఎప్పట్నుంచో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని వార్తలు వచ్చినా సంగీత విడాకులకు అప్లై చేశాకే ఈ ఇద్దరూ కలిసి తిరగడం మొదలుపెట్టారు. మరి సంగీత మళ్ళీ విజయ్ లైఫ్ లోకి వస్తే విజయ్ ఒప్పుకుంటాడా? త్రిష
పరిస్థితి ఏంటి అని చర్చిస్తున్నారు.