
వంటల్లో ఏ నూనె వాడుతున్నామనే విషయంపై పెద్దగా ఎవరూ ఆలోచించరు. కానీ మనం రోజూ తినే ఆహారం ఆరోగ్యంగా ఉండాలంటే నూనె విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మనం ఎంచుకునే నూనెను బట్టి వంటల రుచి, మన ఆరోగ్యం ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో వంట నూనె ఎంపికలో ఎలాంటి విషయాలు గమనించాలో చూద్దాం..వండే పద్ధతిని బట్టి నూనెమన వంట గదిలో రకరకాల వంటలు చేస్తుంటాం.
కొందరు వేపుళ్లు ఎక్కువగా ఇష్టపడితే, మరికొందరు తక్కువ నూనెతో వండుకుంటారు. మనం వండే పద్ధతికి సరిపోయే నూనెను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వేడిని తట్టుకునే నూనెలు వంట రుచిని పెంచుతాయి. వంట శైలికి తగ్గట్టుగా నూనె ఉంటేనే ఆహారం కూడా రుచిగా మారుతుంది.ఎంత నూనె?వంటల్లో ఎంత నూనె వాడుతున్నామనేది చాలా మంది గమనించరు.
కొన్ని నూనెలను పదార్థాలు ఎక్కువగా పీల్చుకుంటాయి. దీనివల్ల వంటకాలు హెవీగా మారి శరీరంలో కొవ్వు పెరుగుతుంది. తక్కువగా పీల్చుకునే నూనెలను వాడితే ఆహారం తేలిగ్గా ఉంటుంది. నూనె వాడకం కూడా తగ్గుతుంది.అన్నింటికీ ఒకటేఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు రకరకాల నూనెలు మార్చడం కష్టం.
అన్ని వంటలకూ సెట్ అయ్యే నూనెను ఎంచుకుంటే పని సులువవుతుంది. ప్రతి వంటకానికి ఒక నూనె చొప్పున మార్చాల్సిన అవసరం ఉండదు. అన్ని రకాల వంటలకూ సరిపోయే నూనె వంట గదిలో ఉండటం ఎంతో మేలు చేస్తుంది.తిరిగి వాడేటప్పుడుభారతీయ వంటల్లో ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడటం కామన్.
ఇలా నూనెను మరిగించినప్పుడు అది త్వరగా పాడవకూడదు. నూనెలు