
హైదరాబాద్ నగర శివారు లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నివాసం ఉంటున్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీయులు నివసిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురిని అరెస్టు చేశారు.
ఈ తనిఖీల సమయంలో వారి వద్ద భారతదేశంలో చట్టబద్ధంగా నివసించేం దుకు అవసరమైన పాస్ పోర్టులు, వీసాలు, ఇతర గుర్తింపు పత్రాలు లేకపోవడం గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో వీరు అక్రమ మార్గాల్లో భారత్లోకి ప్రవేశించి, దేశంలోని పలు ప్రాంతాల్లో కొంతకాలంగా చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు వెల్లడైంది.
ఇటీవల దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల గుర్తింపు, భద్రతా పరమైన తనిఖీలు ముమ్మరం చేసిన నేపథ్యం లో ఈ అరెస్టులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్థానికంగా ఎలాంటి అనుమానాలు రాకుండా సాధా రణ కార్మికుల మాదిరిగా జీవనం సాగిస్తున్న వీరిపై అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.అరెస్ట్ చేసిన ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్కు తరలించారు.
వారి భారత్ ప్రవేశం, ఇక్కడి కార్యకలాపాలు, ఇతరులతో ఉన్న సంబంధాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వృద్ధాశ్రమాల సంక్షేమం కోసం ఆస్తి రాసిచ్చేసిన సిపిఐ నేత నారాయణ దంపతులు
.