.webp&w=3840&q=75)
సమాజ సేవే పరమావధిగా భావిస్తూ సిపిఐ నాయకుడు నారాయణ, ఆయన సతీమణి తమ ఆస్తి మొత్తం వద్ధాశ్రమాల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. జీవితాంతం కష్టపడి సంపా దించిన తమ మొత్తం ఆస్తిని వృద్ధాశ్రమాల సంక్షేమం కోసం విరాళంగా అందించనున్నట్లు వెల్లడించారు.
వారి ఈ నిర్ణయం పట్ల రాజకీయ, సామాజిక వర్గాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుత సమాజంలో వృద్ధుల సంరక్షణ ఒక ప్రధాన సవాలుగా మారు తున్న నేపథ్యంలో, వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాకె తెలిపారు.
తమ ఆస్తిని వృద్ధాశ్రమాల నిర్వహణ, అభివృద్ధి, వృద్ధుల అవసరాల కోసం వినియోగించాలని నారాయణ దంపతులు సంకల్పించారు. నిరాడంబర జీవనశైలికి పేరుగాంచిన నారాయణ దంపతులు ప్రజా సేవకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. రాజకీయ జీవితంలోనూ సాధారణ జీవన విధానాన్ని అనుసరిస్తూ, సామాజిక బాధ్యతను చాటుకుంటూ వచ్చిన వారు ఇప్పుడు మరోసారి తమ సేవాభావాన్ని ఇలా చాటారు.
ఈ నిర్ణయంపై రాజకీయా లకు అతీతంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమాజానికి తిరిగి ఇవ్వాలనే గొప్ప ఆలోచనతో ముందుకొచ్చిన నారాయణ దంపతుల నిర్ణయాన్ని పలువురు వేనోళ్ల అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ వార్త వైరల్గా మారి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.వృద్ధాశ్రమాలకు అందనున్న ఈ ఆస్తి ద్వారా వందలాది మంది వృద్ధులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని సామా జిక కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు.
వృద్ధుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ నిర్ణయం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్ లో అక్రమంగా నివాసముంటున్న బంగ్లాదేశీయుల అరెస్టు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్
.