
ఇంటర్నెట్ డెస్క్: మ్యాగీ నూడుల్స్‌లో పురుగులున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ఆరోపణలను ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా (Nestle India) ఖండించింది. అవన్నీ నిరాధారణ ఆరోపణలని కొట్టిపారేసింది. తమ ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన ఫైలింగ్‌లో కంపెనీ స్పష్టం చేసింది.
మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా ఓ యూజర్ నుంచి వచ్చిన ఆరోపణలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తమ దృష్టికి తీసుకొచ్చినట్లు నెస్లే ఇండియా పేర్కొంది. ఇప్పటివరకు ఆ ఫిర్యాదుదారు నుంచి ఎలాంటి శాంపిల్స్ అందలేదని, కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినా ఆ యూజర్ వివరాలు తెలియరాలేదని కంపెనీ పేర్కొంది.
‘‘మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్‌ను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL)కు పంపించగా, మా ఉత్పత్తుల్లో ఎలాంటి పురుగులు లేవని ధృవీకరించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తులు ఉన్నట్లు నివేదిక వచ్చింది.
వినియోగదారుల ఆరోగ్యం, నాణ్యత విషయంలో రాజీపడబోం. కఠినమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తాం’’ అని నెస్లే ఇండియా వెల్లడించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.