
హర్షవర్థన్, బిందు చంద్రమౌళి ప్రధానపాత్రలు పోషించిన షార్ట్ ఫిల్మ్ 'ఇల్లు'. ఈటీవీ విన్ లో కథా సుధ కేటగిరిలో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటీవల జరిగిన స్పెషల్ స్ట్రీమింగ్ కు రాహుల్ రవీంద్రన్ ముఖ్యఅతిథిగా హాజరైన టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, అనీశ్ కురువిల్ల, పవన్ రమేశ్, క్యాంప్ శశి కీలక పాత్రలు పోషించిన షార్ట్ ఫిల్మ్ 'ఇల్లు'. ఈటీవీ విన్ లోని కథాసుథ కోసం దీనిని కిశోర్ మారిశెట్టి నిర్మించారు. రోహిత్, శశి తెరకెక్కించిన 'ఇల్లు' ఈ నెల 14 నుండి స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా మీడియాకు స్పెషల్ స్క్రీనింగ్ చేసి, ఆ తర్వాత మీడియా సమావేశాన్ని చిత్ర బృందం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ, 'ఒక సాధారణ కథను సహజ సిద్ధంగా, అందంగా ప్రేక్షకులు ముందుకు తీసుకుని రావడం అనేది ఎంతో క్లిష్టమైన విషయం.
జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానున్న 'ఇల్లు' మీ మనసులో ఎంతో ప్రశాంతతను నింపుతుంది' అని అన్నారు. నటి బిందు చంద్రమౌళి మాట్లాడుతూ, ' నాకు ఈ చిత్ర దర్శకులు రోహిత్, శశి ఎంతో కాలం నుండి తెలుసు. నాకు 'ఇల్లు'లో నటించేందుకు అవకాశం ఇచ్చిన వీరికి ధన్యవాదాలు.
మేం రెగ్యులర్ గా చేసే నటనకు ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. మొదటిసారి నేను 'ఇల్లు' చూసినప్పుడు నాకు ఏం చెప్పాలో కూడా మాటలు రాలేదు, అంత బాగుంది. నాకు బాగా నచ్చేసింది. వివేక్ సాగర్ సంగీతం చాలా అద్భుతంగా అనిపించింది. కిషోర్ గారికి, ఈటీవీ వారికి థాంక్స్.
హర్ష గారితో గతంలో కూడా కొన్ని చిత్రాలలో కలిసి నటించాను' అని అన్నారు. నటుడు అనీష్ కురువిల్ల మాట్లాడుతూ, 'దర్శకులు శశి, రోహిత్ కష్టాన్ని, వారి ఆలోచనలను నేను దగ్గరగా గమనించాను. ఇటువంటి ప్రతిభ ఉన్న వారిని ఎంకరేజ్ చేసినందుకు ఈటీవీ విన్
వారికి థ్యాంక్స్. ఇటువంటి సహజ సిద్ధమైన పాత్రలో నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి కథలకు ఇది ఆరంభం మాత్రమే' అని అన్నారు. దర్శకుడు రోహిత్ మాట్లాడుతూ, 'ఈ సినిమాను చాలా పద్ధతిగా చేశాం. ఈ రోజుల్లో ఒక చిన్న కథను చూపించడం, దానికి సంగీతం తోడుగా ఉండి ప్రేక్షకులకు చేరడం ఒక ప్రత్యేకమైన విషయం. మరో మూడు రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ చేయాలి అనగా నాకు కాస్త సందేహంగా ఉన్న సమయంలో 'పర్ఫెక్ట్ డేస్' అనే చిత్రం నా ఆలోచన మార్చేసింది' అని చెప్పారు. నిర్మాత కిషోర్ మారిశెట్టి మాట్లాడుతూ, 'నేను మనోహరి ఆర్ట్స్ ద్వారా ముందుగా 'రాణి' అని ఆహాలో ఒక ప్రాజెక్ట్ చేశాం. సినిమాలు కూడా చేశాను. ఇప్పుడు నిర్మాతగా మారడానికి కారణం రామానాయుడు గారు, రామోజీ గారు. ఒక ఆర్టిస్టుగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ప్రొడక్షన్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాను. కొత్త కంటెంట్ తీసుకునే రావడం నాకు సంతోషాన్నిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకి వచ్చినప్పుడు నాకు దర్శకుల పై మంచి నమ్మకం కలిగింది. వీరి దర్శకత్వ శైలి ప్రత్యేకంగా ఉంటుంది. వారి ఆలోచన చూసి నేను ఆశ్చర్యపోయాను. హర్షవర్ధన్ లాంటి సీనియర్ నటుడు ఈ పాత్ర చేయడం ఒక పెద్ద విషయం' అని అన్నారు.
సుహాసిని బయటపెట్టిన సంచలన నిజం.. చిరంజీవి వల్లే ఆ సీన్ సాధ్యమైంది
షాకింగ్.. కలిసిపోయిన విజయ్- సంగీత.. త్రిష పరిస్థితి ఏంటో