
హైదరాబాద్ నగరంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి, ఓ సామాన్య బైకర్ సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ రాంగ్ రూట్లో బస్సును నడిపిన డ్రైవర్‌కు ఆ బైకర్ అడ్డుగా నిలిచి, చివరికి బస్సును వెనక్కి తిప్పేలా చేసి హీరోగా నిలిచాడు.వివరాల్లోకి వెళితే.. నగరంలోని రద్దీ ప్రాంతంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ట్రాఫిక్‌కు ఎదురుగా, రాంగ్ రూట్లో వేగంగా బస్సును నడుపుకుంటూ వచ్చాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ యువకుడు ఇది గమనించి ఏమాత్రం భయపడలేదు. తన బైక్‌ను ఆ బస్సుకు సరిగ్గా ఎదురుగా ఆపేశాడు. బస్సు వేగానికి ఇతరులు పక్కకు తప్పుకున్నా, అతను మాత్రం వెనకడుగు వేయలేదు.దీంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్ బస్సును కుడివైపునకు తిప్పి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆ బైకర్ కూడా పట్టువదలకుండా బస్సు వెళ్లే మార్గానికి మళ్లీ తన బైక్‌ను అడ్డంగా పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బైకర్ చర్యను చూసి రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులు కూడా అతనికి మద్దతుగా నిలిచారు.చుట్టూ జనం చేరడం, బైకర్ ఏమాత్రం తగ్గకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్‌కు పరిస్థితి అర్థమైంది. చేసేదేమీ లేక, బస్సును నెమ్మదిగా వెనక్కి తిప్పక తప్పలేదు. ఈ నడిరోడ్డు హైడ్రామాను అక్కడున్న వారు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు బైకర్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్‌పై కఠిన చర్యలు