
Motorola G96 5g Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో Motorola G96 5G మొబైల్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తుంది. ఇప్పుడే దీనిని కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల స్పెషల్ ఆఫర్స్
అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై లభిస్తున్న ఆఫర్స్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Motorola G96 5g Price Cut: ప్రముఖ మోటరోలా సంస్థ నుంచి వచ్చిన అద్భుతమైన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్స్‌లో Motorola G96 5G మొబైల్ ఒకటి.. ఇది ఎన్నో రకాల పవర్ఫుల్ ఫీచర్లతో పాటు అద్భుతమైన డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అయితే, స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం గా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దీనిపై ఎన్నో రకాల స్పెషల్ ఆఫర్స్ లభిస్తున్నాయి..
ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న జూన్ ఎపిక్ సేల్‌లో భాగంగా Motorola G96 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఎన్నో స్పెషల్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు దీనిపై ఆధారంగా బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్‌తో పాటు.. ఎక్స్చేంజ్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
Motorola G96 5G మొబైల్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే.. 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర మార్కెట్లో MRP రూ.20,999 కాగా.. దీనిని ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి.. భారీ బ్యాంక్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్స్ పొందడాని ఫ్లిప్కార్ట్అనుసంధాన యాక్సిస్ బ్యాంకు తోపాటు ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా అదనంగా భారీగా ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ సమయంలో ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించుకునే వారికి వరం కంటే ఎక్కువగా భావించవచ్చు. ఎందుకంటే ఫ్లిప్కార్ట్దీనిపై భారీగా ఎక్స్చేంజి బోనస్ అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా మీరు ఏదైనా పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.14 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.5999 లోపే సొంతం చేసుకోవచ్చు..
Motorola G96 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.. ఇది కంటికి ఆకట్టుకునేలా 144Hz 3D కర్వ్డ్ pOLED డిస్ప్లే తో వస్తుంది. అంతేకాకుండా స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కంపెనీ అద్భుతమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్టును కూడా అందిస్తోంది. అలాగే ఇది వెనక భాగంలో చాలా ప్రత్యేకమైన ప్రీమియం వేగన్ లెదర్ (Vegan Leather) ఫినిషింగ్‌తో అందుబాటులోకి రావడం విశేషం..
అలాగే ఈ Motorola G96 5G స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో చాలా శక్తివంతమైన Sony LYT-700C సెన్సార్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరా 50 MP ఉంటుంది. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళ్తే.. ఇది 6.67 ఇంచుల Full HD+ డిస్ప్లే తో లభిస్తుంది. దీంతోపాటు ఇది శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 (Qualcomm Snapdragon 7s Gen 2 - 4nm) ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది..