
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Karimnagar Fertilizer Shortage Telugu News: వానాకాలం సాగు సీజన్ ప్రారంభం వేల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్నదాతలను ఎరువుల కోరతతో పాటు ధరల మాయాజాలం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు ఆకాశాన్ని తాకుతున్న పెట్టుబడి వ్యాయాయంతో పాటు మరోవైపు నకిలీల భయంతో సతమతమవుతున్న రైతులకు.. ఇప్పుడు ఎరువుల వ్యాపారుల దోపిడీ అదనపు శాపంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 12.29 లక్షల ఎకరాల్లో వరి సాగుకు రైతాంగం సర్వం సిద్ధం చేసుకున్న తరుణంలో.. ఎరువుల కృత్రిమ కోరతతో పాటు అక్రమ విక్రయాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తున్నాయి..
పాత స్టాక్‌కు కొత్త ధరలు.. మార్కెట్లోని కొత్త నిలువలు రాకముందే.. పాత స్టాకులను కొత్త ధరలకు విక్రయిస్తూ కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఊహించని స్థాయిలో వెల్లువెత్తుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట విక్రయ ధరల కంటే ఒక్కొక్క ఎరువు బస్తా పై దాదాపు రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రశ్నించిన రైతులకు ఎరువులు లేవంటూ తెగేసి చెప్తుండడంతో.. చేసేదేమీ లేక అడిగినంత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..
యూరియా కావాలంటే.. అవి కొనాల్సిందే.. రైతులను నిలుపునా ముంచుతున్న మరో ప్రధాన సమస్య లింక్ బిజినెస్.. డిమాండ్ ఎక్కువగా ఉన్న యూరియా లేదా ఇతర ముఖ్యమైన కాంప్లెక్స్ ఎరువులు కావాలంటే.. వాటితో పాటు వ్యాపారులకు లాభాలు తెచ్చిపెట్టే ఇతర పనికిరాని జింక్ తో పాటు సల్ఫర్ లేదా బయో ప్రొడక్ట్స్ ను తప్పకుండా కొనుగోలు చేయాలని డీలర్లు మొండి చేస్తున్నారట.. యూరియా బస్తా కావాలంటే రూ.300 విలువ చేసే మరో మందు డబ్బాను బలవంతంగా అంటగడుతున్నారని.. దీనివల్ల వారికి అనవసరమైన ఆర్థిక భారం పెరుగుతుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొంతమంది రైతులు చెబుతున్నారు..
అధికారుల నిఘా కరవు.. అక్రమంగా పెంచిన ధరలకు విక్రయిస్తున్న కారణంగా.. వ్యాపారులు రైతులకు ఎలాంటి అధికారిక బిల్లులు ఇవ్వడం లేదు.. బిల్లులు అడిగితే స్టాక్ లేదని సాకులు చెబుతున్నారు. అంతేకాకుండా పీఓఎస్ మిషన్ల ద్వారానే విక్రయాలు జరపాలని నిబంధనలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రూ.12.29 లక్షల ఎకరాల్లో సాగు అవుతున్న నేపథ్యంలో ఎరువుల అవసరం చాలా ఎక్కువగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకొని సాగుతున్న ఈ దోపిడీపై వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని.. ఆస్క్ ఫోర్స్ బృందాలతో పాటు ఇతర అధికారులు ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించి.. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వారిపై.. లూటీ చేస్తున్న డీలర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.