
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Chanakya niti For Money Savings: ఆచార్య చాణక్య సూత్రాలు ఎంతో సులభమైనవి. కాలానికీ అతీతమైనవి. డబ్బు పొదుపు విషయంలో ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రం వల్ల జీవితంలో సంపద, స్థిరత్వం, శ్రేయస్సు అన్ని పెరుగుతాయి. మీరు ఆర్థిక విజయం సాధించాలంటే.. ఈ సూత్రాలను ఈ రోజే కాదు కాదు ఇప్పటి నుంచే మీ జీవితంలో భాగం చేసుకోవాలి.
చాణక్యుడు ప్రపంచంలోనే గొప్ప రాజకీయ నీతిజ్ఞుడు. ఈయన ఆలోచనలు అప్పటికీ ఎప్పటికీ సదా ఆచరణీయంగా ఉన్నాయి. చాణక్యుడు మావన జీవితంలో నీతి, నిజాయితీపాటు విజయవంతమైన, సంపన్నమైన జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. చాణక్యనీతి ప్రకారం, కొన్ని నిర్ణయాలను దృఢంగా పాటించే వ్యక్తి ధనవంతుడు కావడమే కాకుండా జీవితాంతం ఆనందంగా జీవిస్తాడని చాణక్యుడు చెబుతున్న మాట.
మీరు కూడా ఆర్థిక ఇబ్బందులు దిర చేరకుండా ఉండాలంటే.. ఆచార్య చాణక్యుడు చెప్పే ఈ విషయాలను పాటిస్తే.. మీరు ఎల్లపుడు ధనవంతులుగానే ఉంటారు. ఒక వ్యక్తి అభివృద్ది మార్గంలో నడిపించే చాణక్య సూత్రాల గురించి తెలుసుకుందాం.
ప్రతి విజయానికి కృషి మూలం అని చెప్పాలి...
కష్టపడి పనిచేయడమే సంపదకు మూలం అని ఆచార్య చాణక్య చెబుతున్న అతి ముఖ్యమైన సూత్రం. శ్రమ లేకుండా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం ఉండదు. అయితే కష్టపడి సంపాదించిన సంపద శాశ్వతంగా ఉంటుంది. అదే శ్రేయస్సుతో పాటు ఆర్ధిక పరిపుష్టిని తీసుకొస్తుందని చెప్పారు. కష్టపడి పనిచేసే వారికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని చెప్పుకొచ్చారు.
ఆచార్య చాణక్యుడు డబ్బును ఊరకే ఉంచకూడదని చెప్పారు. డబ్బు నీటిలా ఎల్లపుడు ప్రవహిస్తూ ఉండాలని చెప్పారు. అపుడే ఆర్ధిక వ్యవస్థ కుదేలు కాకుండా స్థిరంగా నిలబడుతుందని చెప్పుకొచ్చారు. సరైన స్థలంలో పెట్టుబడి పెట్టడం వల్ల సంపద పెరుగుతుందని చెప్పారు. అది భవిష్యత్తుకు భద్రతతో పాటు భరోసా ఇస్తుందని చెప్పారు. ప్రణాళిక లేని ఖర్చులను నివారించాలని చెప్పారు. లాభం పొందే అవకాశం ఎక్కువగా ఉన్న చోట డబ్బును పెట్టుబడి పెట్టమని ఆచార్య చాణక్య చెప్పిన అతి ముఖ్య నీతి సూత్రం.
చాణక్యుడు అనవసరమైన ఖర్చులను నివారించాలని చెప్పారు. ఆర్థిక నష్టానికి అది అతిపెద్ద కారణంగా అభివర్ణించాడు. చిన్న చిన్న వ్యర్థమైన ఖర్చులను వీలైనంతగా నివారించాలని చెప్పుకొచ్చాడు. క్రమంగా పెద్ద మొత్తాలుగా పెరిగి మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తాయన చెప్పుకొచ్చాడు. ఖర్చు చేసేటప్పుడు విచక్షణతో వ్యవహరించాలని చెప్పాడు.
చాణక్యుడి ప్రకారం, ప్రతి వ్యక్తి తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేయాలని చెప్పాడు. పొదుపు మనషులకు మనశ్శాంతిని తీసుకురావడమే కాకుండా కష్ట సమయాల్లో మద్దతును అందిస్తుంది. ఆపద కాలంలో ఆదుకోవడంలో సహాయం చేస్తుంది. కాబట్టి ప్రతి మనిషి క్రమం తప్పకుండా పొదుపు చేసేవారు ఏదైనా ఆర్థిక సంక్షోభాన్ని సులభంగా అధిగమించగలరు.
గమనిక (Disclaimer): ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఇవ్వబడింది. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు. ఆచార్య చాణక్యుడికి సంబంధించిన పుస్తకాల్లోని అంశాలనే మేము ప్రస్తావించాము. దీనిని పాటించే ముందు ఆర్ధికంగా నిపుణులైన వారితో పాటు మీ విచక్షణతో పెట్టుబడి పెట్టాలని జీ మీడియా చెబుతున్న మాట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.