
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
AN-32 Aircraft Crashed In Jorhat: జోర్హాట్ ఎయిర్ బేస్‌లో భారత వైమానిక దళానికి చెందిన AN-32 విమానం కుప్పకూలింది. ల్యాండింగ్ సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో విమానం నుండి పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. జోర్హాట్ ఎయిర్పోర్ట్ పరిధిలో జరిగిన ఈ ఘటన వల్ల ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు. అయితే, ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విమానంలో ఉన్న సిబ్బంది ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపై కూడా ఇంకా సమాచారం అందలేదు. ఈ ఘటనపై వైమానిక దళం వేగంగా దర్యాప్తును చేపట్టింది.
సోవియట్ యూనియన్ ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో రూపొందించిన ఏఎన్ 32 అనేది భారత వైమానిక దళం ఉపయోగిస్తున్న ఒక కార్గో విమానం. AN 26 కు అప్డేట్ ఈ విమానం వర్షం పడుతున్నప్పుడు లేదా అధిక వేడి ఉండే వాతావరణంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. 1980వ సంవత్సరంలో భారత వైమానిక దళం ఈ విమానాన్ని తన రవాణా జాబితాలోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా సైనికులు, వారి ఆయుధాలు, సైనిక పరికరాలు ఇతర సామాగ్రిని రవాణా చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
బలమైన విమానం.. ఆంటోనోవ్ AN- 32 అనేది ఒక శక్తివంతమైన విమానం. రెండు ఇంజిన్లు కలిగిన టర్బో ప్రాప్ రవాణా విమానం ఉంది. అయితే, 2025 జూలైలో రాజస్థాన్‌లోని చూర్ జిల్లాలో ఒక జాగ్వార్ యుద్ధ విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.
మిగ్- 29 కూలిపోయింది.. అలాగే 2025 నవంబర్ 4న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కూడా ఒక శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది.. అది మిగ్ 29. కానీ అందులో పైలట్ సురక్షితంగా బయటకు దూకడంతో ప్రాణ నష్టం తప్పింది.. విమానాన్ని నైపుణ్యంతో నియంత్రించి అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక అదే ఏడాది 2025 మార్చి 12న మన స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన హెచ్ ఎల్ తేజస్ యుద్ధ విమానం రాజస్థాన్‌లో కూలిపోయిన విషయం కూడా తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.