
Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం హాజరుకావాల్సిన జిల్లా ఎస్పీ రాకపోవడాన్ని
ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు స్థానిక రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Read Also : HYD Electric Shock Incident: అల్వాల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రి, కూతురు దుర్మరణం!
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధి లక్ష్యంగా ‘మన బడి – మన బాధ్యత’ అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, ఒక కేంద్రమంత్రి హాజరవుతున్న అధికారిక కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతె హాజరుకాకపోవడంతో బండి సంజయ్ తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఎస్పీ గైర్హాజరుపై వేదిక వద్దే ఉన్న డీఎస్పీని కేంద్రమంత్రి బండి సంజయ్ నేరుగా ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించకపోవడంపై మండిపడుతూ, “నన్ను సాధారణ రాజకీయ కార్యకర్త అనుకుంటున్నారా? కేంద్రమంత్రిని అనే గౌరవం లేదా?” అని నిలదీశారు. “బీఆర్ఎస్ పార్టీపై ఎస్పీకి అంత ప్రేమ ఎందుకు? ఒకవేళ అంతగా ఇష్టముంటే కావాలంటే ఆ పార్టీలోనే చేరమనండి, కానీ ప్రభుత్వ విధుల్లో ఇలాంటి నిర్లక్ష్యం తగదు” అంటూ డీఎస్పీ ఎదుటే ఎస్పీ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనతో పాఠశాల ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్రమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Sanathnagar Gym Trainer Harassment: సనత్‌నగర్ కల్ట్ జిమ్‌లో వికృత భాగోతం!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
US Attack : వెనిజులాలోని డ్రగ్ లార్డ్ ను అంతం చేసిన అమెరికా
Mrs. Kerala 2025 Runner-up Harsha Sunny : డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
Charu Pandey: 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
Iran Supreme Leader: అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మళ్ళీ వాయిదా
Hyderabad new flyover: అసెంబ్లీ వద్ద భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి హెచ్ఎండీఏ గ్రీన్ సిగ్నల్
Govt Petrol Diesel Purchase : పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం