
Ministers of Agriculture: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం 62 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజేంద్ర నగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా దేశ హరిత విప్లవ
సాధన లో ఇందిరాగాంధీ విశేష సేవలు అన్న అంశం పై జాతీయ సదస్సు నిర్వహించారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిధి గా హాజరు అయి ప్రసంగించారు. తెలంగాణ కి,భారతదేశానికి గత 62 ఏళ్ళు గా ఈ విశ్వవిద్యాలయం అసమాన సేవలు అందిస్తోందని అభినందించారు.మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ విశ్వవిద్యాలయం వివిధ పంటల లో రూపొందించిన సుమారు 520 వంగడాలు రైతుల మన్ననలు పొందాయన్నారు.అనేక వేల మంది ని పట్టభద్రుల గా తీర్చిదిద్దిందన్నారు. ఇందిరా గాంధీ, స్వామినాథన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తల తోడ్పాటు తో అమలు చేసిన హరిత విప్లవం కారణం గా నేడు ఆహార ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే స్థాయి కి దేశం ఎదిగింది అన్నారు. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు.
Read Also: Komuravelli Railway Station Updates: మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో కొమురవెల్లికి రైలు ప్రయాణం
అనేక దేశాలలో పంట లకు విలువ జోడింపు, మార్కెటింగ్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్, సెన్సర్ ల ఆధారిత వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్నాయని మంత్రి వివరించారు. అదే విధంగా వరి, మొక్క జొన్న పంటల నుంచి ఉప ఉత్పత్తులని రూపొందిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణా వ్యవసాయం కూడా మారాలని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణా వ్యవసాయం సాంకేతిక, విలువ ఆధారిత వ్యవసాయం గా పరిణామం చెందాలని అందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం దిక్సూచి గా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవ ప్రసంగం చేశారు. దేశం ఆహార భద్రత సాధించడం లో , నేడు ఆహార ధాన్యాలని ఎగుమతి చేసే స్థాయి కి భారతదేశం చేరుకోవడానికి ఇందిరాగాంధీ అమలు చేసిన హరిత విప్లవం ప్రధాన కారణం అని అయన అన్నారు. వ్యవసాయ వర్సిటీ వంటి సంస్థల స్థాపన అందుకు దోహదం చేసిందన్నారు.అదే విధంగా బ్యాంక్ లని జాతీయ కరణ చేసి, నాబార్డు ని ఏర్పాటు చేసి రైతులకి, గ్రామీణ ప్రజానీకానికి చాలా మేలు చేశారన్నారు. అయితే ఇప్పటికి అనేకమంది పోషకాహార లోపం తో ఉండటం దురదృష్టం కరమన్నారు. వ్యవసాయ రంగం నేడు ఎదుర్కొంటున్న సవాళ్ళ పరిష్కారానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం మరింత గా కృషి చేయాలని సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఇండియన్ స్థాటిస్టికల్ ఇనిస్టిట్యూట్, బెంగళూరు, ప్రొఫెసర్ అండ్ హెడ్ మధుర స్వామినాథన్ కీలకోపన్యాసం చేశారు.
హరిత విప్లవం తర్వాత భారతదేశం లో ఉత్పత్తి, దిగుబడులు బాగా పెరిగి ఎగుమతులు చేసే స్థాయి కి ఎదిగామని ఆమె అన్నారు. వ్యవసాయ సంస్థ లకి , పరిశోధనలకి ప్రభుత్వాలు విస్తృతం గా ప్రోత్సాహం ఇవ్వాలని మధురా స్వామినాథన్ సూచించారు. శాస్త్ర ఆధారిత,నిరూపిత విధానాలని అనుసరించాలన్నారు. అదే విధంగా ఆహార ఉత్పత్తుల లో మన దేశం స్వయం సమృద్ధి సాధించిన కారణం గా ఇతర దేశాలకి తోడ్పాటు అందించాలని మధుర స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అని అనేక ఆహార ఉత్పత్తులలో అధిక దిగుబడులు సాధిస్తున్నప్పటికి నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి లో కాస్త వెనుక బడి ఉన్నామని మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అయినప్పటికీ దేశం లో సుమారు 80 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ ఎందుకు చేయవలసి వస్తుందో అందరూ ఆలోచించుకోవలసిన అవసరం ఉందన్నారు. అలానే దేశంలోని పరిస్థితుల పైన విద్యావంతులు ఆలోచించాలని అరుణ్ కుమార్ అన్నారు.దేశ వ్యవసాయ రంగానికి ఇందిరా గాంధీ అమోఘం అయిన సేవలు అందించారని తెలంగాణా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి అన్నారు.
నేడు తెలంగాణా లో కూరగాయలు, పూలు, చిరు, తృణ ధాన్యాల సాగు బాగా తగ్గిపోయిందన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పంట మార్పిడి పైన రైతులని చైతన్యవంతులని చేయాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా శాస్త్రీయం గా పంట మద్ధతు ధరలు ప్రకటించి, వ్యవసాయ ఉత్పత్తులని కొనుగోలు చేయాలని కోదండరెడ్డి అభిప్రాయ పడ్డారు. గత 62 ఏళ్ళు గా వ్యవసాయ విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతిని ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వివరించారు. అందుకు సంబంధించిన వీడియో లని ప్రదర్శించారు. ఎంతో పేరున్న విశ్వ విద్యాలయం రాజేంద్ర నగర్ లో ఉండటం మనకెంతో గర్వ కారణం అని కార్యక్రమానికి అధ్యాక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు టి. ప్రకాష్ గౌడ్ అన్నారు. అధికారులు అప్రమత్తం గా ఉంటూ విశ్వ విద్యాలయం ఆస్తులని పరిరక్షించుకోవాలని ప్రకాష్ గౌడ్ సూచించారు.ఈ సందర్బంగా హరిత విప్లవ సాధన లో ఇందిరా గాంధీ పాత్ర అన్న అంశం పైన అల్దాస్ జానయ్య రచించిన పుస్తకాన్ని అతిధులు విడుదల చేశారు. అదే విధంగా తెలంగాణా విజన్ -2047, PJTAU vision-2047 లని కూడా అతిధులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఉత్తమ వ్యవసాయ విధానాలతో సాగు చేస్తున్న రైతులకు పురస్కారాలు అందచేశారు.అదే విధంగా అత్యుత్తమ సేవలు అందించిన బోధన, బోధనేతర సిబ్బంది, శాస్త్ర వేత్తలకి అవార్డు లు అంద చేశారు. అగ్రికల్చర్ డిప్లమా లో అత్యధిక ఓవరాల్ గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ సాధించిన తెలుగు శ్రీ లక్ష్మి కి దివంగత డాక్టర్ ఆలపాటి అప్పారావు బంగారు పతకం అందచేశారు.అలాగే డాక్టర్ వై. ఎస్. ఆర్, డాక్టర్ కే వీ పీ ఫౌండేషన్ తరపున 21 లక్షల రూపాయల చెక్కు ని ఉండవల్లి అరుణ్ కుమార్ అల్దాస్ జానయ్య కి అందచేశారు. ఈ 21 లక్షల రూపాయల మొత్తం పైన ప్రతి ఏటా వచ్చే వడ్డీ తో అత్యుత్తమ ప్రతిభ కనపర్చే విద్యార్థి కి ప్రతి ఏటా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం లో పతకం, సర్టిఫికెట్, ఒక లక్ష రూపాయల నగదు అందిస్తామని అల్దాస్ జానయ్య ప్రకటించారు.ఈ కార్యక్రమం లో హార్టికల్చర్ విశ్వ విద్యాలయం ఉప కులపతి డి. రాజి రెడ్డి, వెటర్నరీ విశ్వ విద్యాలయం ఉప కులపతి జ్ఞాన ప్రకాష్, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ G.E. Ch విద్యాసాగర్,వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, రాములు నాయక్, శాస్త్ర వేత్తలు, బోధన, బోధనేతర సిబ్బంది,విశ్వవిద్యాలయ పూర్వ అధికారులు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.తర్వాత వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రాంగణం లో ఇటీవల HMDA సహకారం తో పునరుద్దరణ చేసిన కిద్వాయ్ కాటేజీ, రిసార్ట్ ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.
Assam Military Aircraft Crash:అస్సాంలో కూలిన AN-31 కార్గో విమానం!
US House of Representatives: అమెరికా ప్రతినిధుల సభలో భారత టెక్ దిగ్గజం సోమశేఖర్‌కు గౌరవం
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Bandi Sanjay: ‘బీఆర్ఎస్పై అంత ప్రేమ ఎందుకు?’.. ఎస్పీపై బండి సంజయ్ ఆగ్రహం!
US Attack : వెనిజులాలోని డ్రగ్ లార్డ్ ను అంతం చేసిన అమెరికా
Mrs. Kerala 2025 Runner-up Harsha Sunny : డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
Charu Pandey: 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
Iran Supreme Leader: అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మళ్ళీ వాయిదా