
ప్రస్తుతం సినీరంగంలో ఆమె తోపు హీరోయిన్. కానీ తొలిసారిగా చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పుడు అసలు సినిమా, ఇండస్ట్రీ గురించి ఆమెకు ఏమాత్రం సంబంధం లేదు. అతి తక్కువ సమయంలోనే చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక
ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్న కొద్దిమంది నటీమణులలో ఆమె ఒకరు. కానీ ఆమె విజయగాథ బయటకు కనిపించినంత సులభమైనది కాదు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె జీవితంలో ఎంతో పోరాడిందని చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు మనం మట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు దిశా పటాని. 1992, జూన్ 13న ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో జన్మించిన ఆమె కుటుంబం మూలాలు ఉత్తరాఖండ్‌లోని తానక్‌పూర్. ఆమె తండ్రి జగదీష్ సింగ్ పటాని ఒక సీనియర్ పోలీస్ అధికారి కాగా, ఆమె తల్లి ఆరోగ్య శాఖలో పనిచేశారు. దిశా చిన్నప్పటి నుంచే చదువులో చాలా చురుకైనది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె నటి కావాలని ఎప్పుడూ కలగనలేదు..
ఎక్కువమంది చదివినవి : Sridevi Vijaykumar : ఇప్పుడున్న హీరోలలో అతడంటే పిచ్చి ఇష్టం.. అతడే నా ఫేవరేట్.. హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్..
దిశ మొదట్లో ఎయిర్ ఫోర్స్ పైలట్ లేదా శాస్త్రవేత్త కావాలనుకుంది. అందుకే, ఆమె తర్వాత ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ చదివింది. కానీ ఆమె కాలేజీ రోజుల్లో విధి ఒక మలుపు తీసుకుంది. ఒక స్నేహితురాలు ఆమెను మోడలింగ్ పోటీలో పాల్గొనమని సలహా ఇచ్చింది. దిశ ఆ పోటీలో పాల్గొనడమే కాకుండా గెలుపొందింది కూడా. గెలిచిన తర్వాత, దిశాకు మోడలింగ్‌లో కొత్త మార్గాలు తెరుచుకున్నాయి, ఆమెకు అనేక ప్రముఖ బ్రాండ్ల వాణిజ్య ప్రకటనలలో నటించే అవకాశాలు రావడం ప్రారంభమైంది. వాణిజ్య ప్రకటనలలో కెమెరాను ఎదుర్కోవడం ఆమెలో నటన పట్ల ఆసక్తిని రేకెత్తించింది. చివరికి, తన కలలను సాకారం చేసుకోవడానికి ఆమె ముంబైకి వెళ్లాలని నిర్ణయించుకుంది, కానీ ఆ ప్రయాణం అంత సులభమైనది కాదు.
ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‌కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
తాను మొదట ముంబైకి వచ్చినప్పుడు తన జేబులో కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయని దిశా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముంబై లాంటి ఖరీదైన నగరంలో అంత తక్కువ డబ్బుతో బతకడం ఒక సవాలు. కానీ ఆమె తన కుటుంబం నుండి ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోకూడదని, తాను చేసే పనులన్నీ సొంతంగానే చేసుకోవాలని నిశ్చయించుకుంది. 2015లో వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ ఆమెకు తొలి చిత్రం. కానీ థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయ్యింది. ఒక సంవత్సరం తర్వాత, 2016లో, బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ'లో నటించే అవకాశం ఆమెకు దక్కింది. ఈ చిత్రంలో, ధోని మొదటి ప్రియురాలు ప్రియాంక ఝాగా ఆమె పోషించిన చిన్న పాత్రతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. తర్వాత హిందీలో వరుస సినిమాలతో రాణించింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గినప్పటికీ నెట్టింట గ్లామర్ ఫోటోషూట్లతో రాణిస్తుంది.
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు
A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)
ఎక్కువమంది చదివినవి : Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..