
ఏ భాషలో మంచి సినిమా వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నటుడు సత్యదేవ్ అన్నారు. జులై 3న ‘రావు బహదూర్’ విడుదలైన తర్వాత ఇతర ఇండస్ట్రీలూ దీని గురించి మాట్లాడుకుంటాయన్నారు. సత్యదేవ్ ప్రధానపాత్రలో
వెంకటేశ్ మహ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే ‘రావు బహదూర్’. ఈ మూవీకి అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన టీజర్ రిలీజ్ ఈవెంట్లో సత్యదేవ్ మాట్లాడారు. ఈ సినిమా కోసం సాంకేతిక బృందం ఎంతో కష్టపడిందని తెలిపారు. ఒక సన్నివేశంలో తాను వేసుకున్న దుస్తులు 1950-60 కాలంలోవని చెప్పారు. ఈ వార్త చదివారా: ఓటీటీలోకి దృశ్యం 3.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?