
నేరేడు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ఆయుర్వేద పరంగా అన్ని విధాల ఆరోగ్యానికి మేలు అన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇలాంటి సమస్యలు ఉంటే తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు వైద్యులు. ఎలాంటి అనారోగ్య
Jun 13 2026 10:27 AM | Updated on Jun 13 2026 10:27 AM
నేరేడు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ఆయుర్వేద పరంగా అన్ని విధాల ఆరోగ్యానికి మేలు అన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇలాంటి సమస్యలు ఉంటే తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు వైద్యులు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉంటే నేరేడు పండ్లు తీసుకోకూడదో తెలుసుకుందామా.!.
నేరేడు పండ్లు ఇపుడు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండు, అందరికీ మేలు చేయకపోవచ్చు. నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. అయితే, డయాబెటిస్ కోసం మందులు వాడుతున్న వారు వీటిని అధికంగా తీసుకుంటే, రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కళ్ళు తిరగడం, విపరీతంగా చెమటలు పట్టడం, కంగారు, గుండె వేగం పెరగడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ పండ్లలో సహజంగానే ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రంలోని క్యాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి, ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు లేదా ఆ సమస్య వచ్చే అవకాశం ఉన్నవారు నేరేడు పండ్లను పరిమితంగానే తినాలి.
నేరేడు పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిదే. కానీ, ఒకేసారి వీటిని అతిగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, లేదా కడుపు తిప్పడం వంటి సమస్యలు రావచ్చు. ∙ఈ పండ్లను అతిగా తింటే బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల గర్భిణులు నేరేడు పండ్లను తినే ముందు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం.
అలర్జీ హిస్టరీ ఉన్నవారు ఈ పండును మొదటిసారి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరికి నేరేడు పండ్ల వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది.
ఫిఫా ప్రపంచకప్ 2026 : అందరి కళ్లు వీరిపైనే..(ఫొటోలు)
వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
FLO StyleTatva 6వ ఎడిషన్ను ప్రారంభించిన విజయలక్ష్మి , సుధా రెడ్డి (ఫొటోలు)
హైలైఫ్ ఎగ్జిబిషన్ లో...అందమైన భామలు లేత మెరుపు తీగలు (ఫొటోలు)
హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల భారీ వర్షం (ఫొటోలు)
నేను నా కొడుకు దద్దమ్మలం.. మీ సంపద మీరే సృష్టించుకోండి చేతులెత్తేసిన చంద్రబాబు..
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపిన భార్య
యుద్ధం ముగించలేదు.. ట్రంప్ కు ఇరాన్ హెచ్చరిక
పాప తల్లి షాకింగ్ నిజాలు! జ్ఞానేశ్వరి తండ్రిపై పెరుగుతున్న అనుమానాలు..?
కడప MLA కాదు కూల్చివేతల MLA.. మాదవి రెడ్డిపై కడప మాజీ మేయర్ ఫైర్