
కిటికీ అంచున వేలాడుతూ ఓ పసిప్రాణం.. తొమ్మిది నిమిషాల పాటు కొనసాగిన ఉత్కంఠ.. ఇక కిందపడిపోతుందనుకుని అంతా కళ్లు మూసుకున్న టైంలో.. అనూహ్యంగా ఓ భారతీయుడు ఆమె ప్రాణం కాపాడాడు. లండన్‌లో జరిగిన ఈ
Jun 13 2026 10:28 AM | Updated on Jun 13 2026 10:28 AM
కిటికీ అంచున వేలాడుతూ ఓ పసిప్రాణం.. తొమ్మిది నిమిషాల పాటు కొనసాగిన ఉత్కంఠ.. ఇక కిందపడిపోతుందనుకుని అంతా కళ్లు మూసుకున్న టైంలో.. అనూహ్యంగా ఓ భారతీయుడు ఆమె ప్రాణం కాపాడాడు. లండన్‌లో జరిగిన ఈ ఉత్కంఠభరిత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తూర్పు లండన్‌లోని ఇల్ఫోర్డ్ హైరోడ్ ప్రాంతంలో మంగళవారం మద్యాహ్నా సమయంలో.. ఓ భవనం కిటికీ అంచుపై మూడేళ్ల చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించింది. ఆమె ఎప్పుడు కిందపడిపోతుందోనన్న భయంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు అధికారి, స్థానిక రెస్టారెంట్ మేనేజర్ మొహమ్మద్ జెసిల్ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు.
చిన్నారి పట్టును కోల్పోతున్న సమయంలో ఓ వ్యక్తి నిచ్చెన తీసుకొచ్చి సహాయం చేశాడు. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో చిన్నారి కిందకు జారిపోయింది. అదే సమయంలో అప్రమత్తంగా ఉన్న జెసిల్ అనే భారతీయ వ్యక్తి.. ఆమెను అద్భుతంగా అందుకుని ప్రాణాలు కాపాడాడు. పక్కనే ఉన్న పోలీసు అధికారి కూడా అతడికి సహకరించడంతో ప్రమాదం తప్పింది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై స్పందించిన జెసిల్.. తాను భారతదేశంలో క్రికెట్ ఆడిన అనుభవమే ఆ సమయంలో ఉపయోగపడిందని చెప్పారు. "ఆ క్షణంలో ఎక్కువగా ఆలోచించలేదు. ఓ తండ్రిగా అలా ముందుకు వెళ్లాను. క్రికెట్ ఆడిన అనుభవం వల్ల క్యాచ్‌పై దృష్టి పెట్టగలిగాను" అని తెలిపారు. ఇక చిన్నారి తండ్రి స్పందిస్తూ.. తన కుమార్తెను కాపాడిన జెసిల్, పోలీసు అధికారిని నిజమైన హీరోలుగా అభివర్ణించారు. ప్రమాదంలో చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదని.. ఆమె తిరిగి పాఠశాలకు కూడా వెళ్లిందని తెలిపారు.
లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తక్కువ టైంలోనే రెస్క్యూ ఆపరేషన్ ముగిందని ప్రకటించారు. మనోడు పాల్గొన్న ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి..
ఫిఫా ప్రపంచకప్ 2026 : అందరి కళ్లు వీరిపైనే..(ఫొటోలు)
వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
FLO StyleTatva 6వ ఎడిషన్‌ను ప్రారంభించిన విజయలక్ష్మి , సుధా రెడ్డి (ఫొటోలు)
హైలైఫ్ ఎగ్జిబిషన్ లో...అందమైన భామలు లేత మెరుపు తీగలు (ఫొటోలు)
హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల భారీ వర్షం (ఫొటోలు)
నేను నా కొడుకు దద్దమ్మలం.. మీ సంపద మీరే సృష్టించుకోండి చేతులెత్తేసిన చంద్రబాబు..
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపిన భార్య
యుద్ధం ముగించలేదు.. ట్రంప్ కు ఇరాన్ హెచ్చరిక
పాప తల్లి షాకింగ్ నిజాలు! జ్ఞానేశ్వరి తండ్రిపై పెరుగుతున్న అనుమానాలు..?
కడప MLA కాదు కూల్చివేతల MLA.. మాదవి రెడ్డిపై కడప మాజీ మేయర్ ఫైర్