
బిజినెస్ ప్రపంచంలో రూల్స్ అందరికీ ఒకలా ఉంటే.. ఎలాన్ మస్క్కు మాత్రం మరోలా ఉంటాయి. వాల్ స్ట్రీట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల ముక్కు పిండి మరీ తన పంతం నెగ్గించుకున్నారు
బిజినెస్ ప్రపంచంలో రూల్స్ అందరికీ ఒకలా ఉంటే.. ఎలాన్ మస్క్‌కు మాత్రం మరోలా ఉంటాయి. వాల్ స్ట్రీట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల ముక్కు పిండి మరీ తన పంతం నెగ్గించుకున్నారు మస్క్. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పేస్‌ఎక్స్ (SpaceX) ఐపీఓ (IPO) వేదికగా జరిగిన ఒక వింతైన, సంచలన బిజినెస్ డీల్ ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది.ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన, శాటిలైట్ - ఏఐ దిగ్గజ సంస్థ అయిన స్పేస్‌ఎక్స్ తన ప్రాథమిక పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా ఆర్థిక మార్కెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే, ఈ ఐపీఓ సక్సెస్ కంటే.. వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతో మస్క్ కుదుర్చుకున్న ఫీజుల ఒప్పందం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మార్కెట్ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, బ్యాంకర్లకు పైసా కూడా అదనపు ఫీజు ఇవ్వకుండా మస్క్ షాకిచ్చారు.ఈ ఒప్పందంలోని అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఐపీఓ ప్రక్రియలో అండర్‌రైటర్లు అదనంగా మరో 15 శాతం షేర్లను విక్రయించడానికి అనుమతించే గ్రీన్‌షూ (Green Shoe) ఆప్షన్‌ను ఉపయోగిస్తే, స్పేస్‌ఎక్స్ వారికి రూపాయి కూడా ఫీజు చెల్లించదు! దీనివల్ల గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ వంటి ప్రపంచ ఆర్థిక దిగ్గజ బ్యాంకులు తాము అదనంగా సంపాదించాల్సిన దాదాపు 75 మిలియన్ డాలర్ల (సుమారు రూ.625 కోట్లు) భారీ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయాయి.ఈ అదనపు షేర్ల విలువ ఎంతో తెలుసా?స్పేస్‌ఎక్స్ ఒప్పందం ప్రకారం.. ఈ గ్రీన్‌షూ ఆప్షన్ కింద బ్యాంకర్లు అదనంగా ఏకంగా 11.25 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించే సదుపాయం లభిస్తుంది. సాధారణంగా అమెరికా మార్కెట్లలోకి వచ్చే చాలా పెద్ద కంపెనీల మొత్తం ఐపీఓ విలువ కూడా ఇంత ఉండదు. అంతటి భారీ విక్రయ ప్రక్రియను బ్యాంకర్లు ఫ్రీగా, ఒక్క రూపాయి ఆశించకుండా చేయడానికి అంగీకరించడం వాల్ స్ట్రీట్ చరిత్రలోనే అత్యంత అరుదైన విషయం. ఈ గ్రీన్‌షూ ఆప్షన్‌ను పూర్తిగా వాడుకోవడానికి బ్యాంకర్లకు కేవలం 30 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఈ వింత ఒప్పందంపై అధికారికంగా మాట్లాడటానికి మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాక్స్ ప్రతినిధులు నిరాకరించారు.మస్క్ ఇచ్చిన మొత్తం ఫీజు ఎంత?ఈ ఐపీఓ ద్వారా స్పేస్‌ఎక్స్ ఏకంగా 75 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని మార్కెట్ నుంచి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మెగా డీల్‌ను విజయవంతం చేసినందుకు డీల్ మేకర్లకు మొత్తం 500 మిలియన్ డాలర్ల ఫీజు చెల్లించేందుకు మస్క్ ఒప్పుకున్నారు. ఇది వారు సేకరించిన మొత్తం నిధులలో కేవలం 0.67 శాతం మాత్రమే! సాధారణంగా అమెరికా వాల్ స్ట్రీట్ మార్కెట్లలో ఐపీఓల కోసం బ్యాంకులు 4 శాతం నుంచి 7 శాతం వరకు భారీ ఫీజులు వసూలు చేస్తాయి. ఎంత పెద్ద కంపెనీ అయినా అది కనీసం 1 శాతం కంటే ఎక్కువగానే ఉంటుంది. కానీ మస్క్ మాత్రం కేవలం 0.67 శాతానికే బ్యాంకర్లను ఒప్పించారు.లోకంలోనే మొదటి ట్రిలియనీర్. ప్రపంచాన్ని శాసించబోతున్న ఒకే ఒక్కడు!అయినప్పటికీ, ఐపీఓ సైజ్ చాలా పెద్దది కావడంతో లీడ్ బ్యాంకులుగా వ్యవహరించిన గోల్డ్‌మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ సంస్థలు చెరో 100 మిలియన్ డాలర్ల భారీ ఆదాయాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. వీటితో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, జేపీమోర్గాన్ చేజ్ సంస్థలు కూడా ఈ ఐపీఓలో కీలక పాత్ర పోషించి, ప్రతి ఒక్కరు 75 మిలియన్ డాలర్ల చొప్పున ఫీజు అందుకున్నారు. ఇక ఇందులో కేవలం కో-మేనేజర్లుగా వ్యవహరించిన ఒక డజను కంటే ఎక్కువ చిన్న బ్యాంకులకు మాత్రం కేవలం 2 మిలియన్ డాలర్ల చొప్పున మాత్రమే దక్కింది.నిజంగానే పచ్చ బూట్లు వేసుకుని వచ్చిన సీఈఓలు!ఎలాన్ మస్క్ అంటేనే వినూత్న శైలికి కేరాఫ్ అడ్రస్. ఈ చారిత్రాత్మక గ్రీన్‌షూ ఒప్పందాన్ని మరింత ఫన్నీగా మార్చడానికి ఆయన ఒక క్రేజీ కండిషన్ పెట్టారు. ఐపీఓ వేడుకకు వచ్చే గోల్డ్‌మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ బ్యాంకులకు చెందిన టాప్ బాస్‌లందరూ నిజంగానే పచ్చని రంగు బూట్లు (Green Shoes) ధరించి రావాలని కోరారు. మస్క్ మాటను జవదాటలేక ఆయా బ్యాంకుల సీఈఓలు పచ్చ బూట్లలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.SpaceX IPO: మస్క్ దెబ్బ.. వాల్ స్ట్రీట్ అబ్బా! ప్రపంచ రికార్డులు బద్దలుఇటీవలే ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించిన ఎలాన్ మస్క్, ఈ వినోదాత్మక సంఘటనను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మోర్గాన్ స్టాన్లీ సీఈఓ టెడ్ పిక్, అలాగే మస్క్ ఆర్థిక సలహాదారు మైఖేల్ గ్రిమ్స్ ఆకుపచ్చ రంగు స్నీకర్లు ధరించి ఉన్న ఫోటోను ఆయన పోస్ట్ చేయడంతో అది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. బిజినెస్ డీల్స్ మాట్లాడటంలో మస్క్ మైండ్ పవర్‌కు ఈ స్పేస్‌ఎక్స్ ఐపీఓ ఫీజు ఒప్పందమే ఒక నిదర్శనం.