
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో ప్రధాన ఆకర్షణ కలిగిన ప్లేయర్లలో నెయ్మర్ ఒకరు. బ్రెజిల్‌కు చెందిన ఈ స్టార్ ఆటగాడి ఆటను చూడాలని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉవ్విళ్లూరుతారు. కానీ, వరల్డ్ కప్
2026 తొలి మ్యాచ్‌లో నెయ్మర్ బరిలోకి దిగడం లేదు. బ్రెజిల్‌కు కీలక ప్లేయర్ అయిన 34 ఏళ్ల నెయ్మర్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే. మొరాకోతో ఆదివారం వేకువజామున 3.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) బ్రెజిల్ తలపడనుంది. టైటిల్ ఫేవరెట్ అయిన బ్రెజిల్ నెయ్మర్ లేకుండా తమ తొలి మ్యాచ్‌లో ఎలా ఆడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పిక్క గాయం కారణంగా నెయ్మర్ తమ జట్టు మొదటి మ్యాచ్‌కు దూరంగా ఉంటాడని బ్రెజిల్ కోచ్ కార్లో వెల్లడించాడు. అయితే, అతడు కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని ఫిఫా వర్గాలు పేర్కొన్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచులన్నింటినీ మిస్ అయ్యే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఐదుసార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్ కప్ ఆశలు ఇబ్బందుల్లో పడినట్లే. గ్రూప్ Fలో ఉన్న బ్రెజిల్.. జూన్ 19న హైతీతో, జూన్ 24న స్కాట్లాండ్తో తలపడనుంది. అప్పటికైనా కోలుకుని వస్తాడనే గ్యారంటీని బ్రెజిల్ కోచ్ కూడా ఇవ్వలేదు.
‘‘వీలైనంత త్వరగా ఫిట్నెస్ సాధించడానికి నెయ్మర్ ప్రయత్నిస్తున్నాడు. తప్పకుండా వచ్చేవారం నాటికి కోలుకుని సిద్ధమవుతాడని ఆశిస్తున్నాం. జట్టులోని కుర్రాళ్లకు అతడు స్ఫూర్తి. ఆరో టైటిల్‌ను నెగ్గాలనే బ్రెజిల్ కలను సాకారం చేసుకొనేందుకు నెయ్మర్ అనుభవం పనికొస్తుంది. అతడు లేకుండా ఎలా ఆడాలనే దానిపైనా మేం సన్నద్ధమయ్యాం. మా ఆటతీరులో ఎలాంటి మార్పు ఉండదు’’ అని కోచ్ కార్లో యాన్సెలొట్టి తెలిపాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.