
బిగ్ బాస్ సందడి షురూ అయ్యింది. బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు నిర్వహకులు. దీనికోసం హోస్ట్ నాగార్జున ఇప్పటికే రెడీ అయ్యారు. ఆయన బిగ్ బాస్ లవర్స్ లో ఊపు తీసుకొచ్చే
ప్లాన్ చేస్తున్నారు. మొన్న బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో సాంగ్ ని విడుదల చేశారు. షో గురించి చెబుతూ, దాని ప్రత్యేకతని చెబుతూ, ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చెబుతూ ఈ పాట సాగింది. ఈ సారి ఎంటర్ టైన్మెంట్ వేరే లెవల్ అని తెలిపారు. అదే సమయంలో బిగ్ బాస్ దశావతారం అంటూ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు నాగార్జున.
ఈ నేపథ్యంలో కామన్ మ్యాన్‌కి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గత సీజన్లోనూ కామన్ మ్యాన్‌కి అవకాశం కల్పించింది. అందుకోసం `అగ్నిపరీక్ష` పేరుతో ప్రత్యేకంగా షోని నిర్వహిస్తుంది. ఇందులో కామన్ మ్యాన్లను కొంత మందిని ఎంపిక చేసి, వారిలో ఫిల్టర్ చేస్తుంది. ఫైనల్‌గా ఐదారుగురిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేస్తుంటుంది. గత సీజన్లో ఏడుగురు కంటెస్టెంట్లని మెయిన్ షోకి ఎంపిక చేసింది. అంతేకాదు కామన్ మ్యానే గత సీజన్లో విజేతగా నిలిచారు. కళ్యాణ్ పడాల అగ్నిపరీక్ష ద్వారా వచ్చి టైటిల్ విన్ అయిన విషయం తెలిసిందే.
ఈ సారి కూడా అగ్నిపరీక్షకి పెద్ద పీఠ వేస్తున్నారు బిగ్ బాస్ నిర్వహకులు. ఈ సారి ఎక్కువ మంది కంటెస్టెంట్లని ఈ కామన్ మ్యాన్ కేటగిరిలో ఎంపిక చేయబోతున్నారు. తాజాగా `అగ్నిపరీక్ష` సీజన్ 2 షురూ అయ్యింది. బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం కల్పించింది. అగ్నిపరీక్షకి కామనర్స్ ని ఆహ్వానించింది. శుక్రవారం(జూన్ 12) నుంచే ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు అధికారికంగా హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించారు. అప్లై చేసుకునే వెబ్ సైట్ డిటెయిల్స్ ని కూడా ప్రకటించారు. జూన్ 12 నుంచి జూన్ 20 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఇందులో ఆడిషన్‌కి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేయాల్సి ఉంది. ఎందుకు బిగ్ బాస్ షోకి వెళ్లాలనుకుంటున్నారు? అనేది అందులో చెప్పాల్సి ఉంటుంది.
ఈ నెలాఖరులో వచ్చిన అప్లికేషన్స్ ని లిస్ట్ చేస్తారు, జులైలో ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. జులై ఎండింగ్, ఆగస్ట్ లో అగ్నిపరీక్షని నిర్వహిస్తారు. అందులోనుంచి మెయిన్ కంటెస్టెంట్లని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటిలాగే ఈ సీజన్ కూడా సెప్టెంబర్‌లోనే ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఇదిలా ఉంటే అగ్నిపరీక్షలో ఎంపికయ్యారంటే టైటిల్ విన్ అయ్యే ఛాన్స్ కామనర్స్ దే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కామనర్స్ ని టైటిల్ విన్నర్‌గా చేయడంతో బిగ్ బాస్ షో నిర్వహకులకు మంచి మైలేజ్ వస్తుంది. షోకి ఆదరణ పెరుగుతుంది. దీంతో చాలా వరకు కామనర్స్ నే విన్నర్‌ని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సారి కామనర్స్ ని చేస్తారా? సెలబ్రిటీని విన్నర్‌ని చేస్తారా అనేది చూడాలి.
ఇక సెలబ్రిటీ విభాగంలో ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి రాబోతున్న వారిలో క్రేజీ సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. తేజస్విని గౌడ, శివకుమార్, ఈటీవీ ప్రభాకర్గానీ, ఆయన కొడుకు చంద్రహాస్‌గానీ వచ్చే అవకాశం ఉందట. అలాగే పల్లవి గౌడ, ఎక్స్ ప్రెస్ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్, నందూస్ వరల్డ్ నందూ, పండు మాస్టర్, ఆట సందీప్ భార్య జ్యోతి, రాయల్ మెక్ రమణ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, రైటర్ కడలి సత్యనారాయణ, వంటి వారు వచ్చే ఛాన్స్ ఉందని టాక్. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.