
భారత షూటింగ్ రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్ గురువు, మెంటర్, ప్రముఖ షూటింగ్ కోచ్ జస్పాల్ రాణా (49) హఠాన్మరణం చెందారు. ఇటీవల స్టెంట్ చికిత్స చేయించుకున్న ఆయన, ఆ
తర్వాత తలెత్తిన ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో భారత క్రీడాలోకం, ముఖ్యంగా షూటింగ్ కమ్యూనిటీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.తన గురువు మరణంపై స్టార్ షూటర్ మను భాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనకు 'తీరని నష్టం' అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' లో భావోద్వేగ పోస్ట్ చేశారు. తన కోచ్‌తో కలిసి దిగిన చిత్రాలను పంచుకుంటూ, తన కెరీర్లో ఆయన ప్రాముఖ్యతను గుర్తుచేసుకున్నారు. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన తర్వాత మను భాకర్ కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టింది జస్పాల్ రాణానే. ఆయన మార్గదర్శనంలోనే ఆమె ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని పారిస్ 2024 ఒలింపిక్స్‌లో ఏకంగా రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు.ఒకప్పటి భారత అగ్రశ్రేణి పిస్టల్ షూటర్ అయిన జస్పాల్ రాణా, క్రీడా జీవితం నుంచి రిటైర్ అయ్యాక కోచ్‌గా మారారు. తొలుత డెహ్రాడూన్‌లో తన అకాడమీ ద్వారా యువ షూటర్లకు శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత జాతీయ జట్టుకు కోచ్‌గా సేవలందించారు. అనతికాలంలోనే దేశంలోని అత్యంత ముఖ్యమైన కోచ్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు.కోచ్ మరణవార్త తెలియగానే మను భాకర్ డెహ్రాడూన్‌లోని ట్రైనింగ్ క్యాంప్ నుంచి నేరుగా రాణా నివాసానికి, అకాడమీకి