
తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ (Vijay Joseph) ప్రస్తుతం ప్రజాసేవలో మునిగిపోయారు. పదవి చేపట్టిన దగ్గరనుంచి ఆయన ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నారు. ఇంకోపక్క ఇండస్ట్రీకి కూడా దగ్గరగానే ఉంటున్నారు. తమిళనాడు
సీఎం విజయ్ జోసెఫ్ (Vijay Joseph) ప్రస్తుతం ప్రజాసేవలో మునిగిపోయారు. పదవి చేపట్టిన దగ్గరనుంచి ఆయన ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నారు. ఇంకోపక్క ఇండస్ట్రీకి కూడా దగ్గరగానే ఉంటున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. విజయ్ వ్యక్తిగత విషయం ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొంతకాలంగా విజయ్, ఆయన భార్య సంగీత విడివిడిగా ఉంటున్న విషయం తెల్సిందే. ఎన్నికల సమయంలో విజయ్ భార్య సంగీత.. తన భర్త నటి త్రిషతో రిలేషన్ లో ఉన్నారని, తనను, తన పిల్లలను ఆయన మోసం చేశారని, తనకు విడాకులు ఇప్పించాలాని కోర్టులో కేసు వేశారు. విజయ్ సీఎం అయ్యినప్పుడు కానీ, ప్రమాణ స్వీకారం అప్పుడు కానీ.. సంగీత, పిల్లలు ఆయన పక్కన లేరు. దీంతో వీరిమధ్య దూరం బాగా పెరిగిందని, సంగీత ఇక లండన్ నుంచి రాదనుకున్నారు. త్వరలోనే విజయ్.. త్రిషను పెళ్ళి చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.
ఇక తాజాగా ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చినట్లు విజయ్ - సంగీత కలిసిపోయారని సమాచారం. వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలను పరిష్కరించి, ఈ జంటను తిరిగి ఒకటి చేయడానికి కుటుంబ సభ్యులు తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేసినట్లు తెలుస్తోంది. కొడుకు- కోడలిని కలపడానికి విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ అత్యంత కీలక పాత్ర పోషించారని టాక్. కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అలాగే కుటుంబ బంధాలను కాపాడుకోవడానికి శోభ స్వయంగా కోడలు సంగీతతో మాట్లాడి, ఇరుపక్షాల మధ్య ఉన్న విభేదాలను సక్సెస్ ఫుల్‌గా సెటిల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. తల్లి చేసిన ఈ గట్టి ప్రయత్నాల వల్లనే విజయ్ - సంగీత మళ్లీ కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెన్నై వర్గాల సమాచారం.
విజయ్ త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో.. భార్య సంగీత మళ్లీ ఆయన పక్కన చేరడం పొలిటికల్‌గా కూడా విజయ్‌కు చాలా ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకోపక్క విజయ్ కొడుకు జాన్సన్ విజయ్ కి కూడా ఇప్పుడు తండ్రి సపోర్ట్ చాలా అవసరం. అందుకే సంగీత కూడా భర్తతో ఉండడానికి ఒప్పుకొన్నారని అంటున్నారు. అంతా బానే ఉన్నా.. ఇప్పుడు త్రిష పరిస్థితి ఏంటి అనేది మిస్టరీగా మారింది. విజయ్ కోసం త్రిష పడిన కష్టం అంతా ఇంతా కాదు. కనీసం.. క్యాబినెట్ లో ఆమెకు ఒక పదవిని కూడా విజయ్ అందించలేదు. ప్రేమ, పెళ్ళి అంటూ విజయ్ వెనుక తిరిగిన త్రిషకు ఇప్పటివరకు ఒరిగింది ఏం లేదు. అలాంటప్పుడు విజయ్ - సంగీత కలిసిపోతే త్రిష సైలెంట్ గా ఉంటుందా.. ? భార్యాభర్తల మధ్య నుంచి త్రిష వెళ్లిపోతుందా.. ? త్రిషతో తన భర్త రిలేషన్ లో ఉన్నారని డైరెక్ట్ గా చెప్పిన సంగీత.. ఇప్పుడు సడెన్ గా కలిసిపోయారు అంటే త్రిష- విజయ్ రిలేషన్ ని ఆమె ఒప్పుకున్నట్టేనా.. లేక అత్త శోభా.. త్రిషను దూరం పెట్టమని కొడుకుకు చెప్పి ఒప్పించిందా అనేది తెలియాల్సి ఉంది.
Transfer Trimurthulu Trailer: కానిస్టేబుల్ వేసిన స్కెచ్‌కి సీఎం మైండ్ బ్లాక్..
Dridam: అదేం క్లైమాక్స్ రా మావా.. మెంటలొచ్చేస్తది అంతే
Vikram: 60 ఏళ్ళ వయస్సులో ఆ ఫిట్ నెస్ ఏంటి సామీ..