
Telangana Rains: తెలంగాణలో ప్రస్తుతం అత్యంత విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతుంటే, ఇంకోపక్క భానుడి భగభగలు, ఉక్కపోతతో
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read also: Telangana Bhavan Press Meet:పెన్షనర్లకు హెల్త్ కార్డులు ఎక్కడ?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్!
గడిచిన 24 గంటల్లో నల్గొండ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడి పెద్దవూర మండలం పులిచెర్లలో ఏకంగా 11.2 సెంటీమీటర్ల భారీ వర్షం పడటంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. అటు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ను కూడా వాన ముంచెత్తింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి జూబ్లీహిల్స్, అమీర్‌పేట, మియాపూర్, కేపీహెచ్‌బీ, చందానగర్, కోఠి వంటి ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే నరకం చూశారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ (DRF) సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
సాధారణంగా రుతుపవనాలు వస్తే వాతావరణం చల్లబడుతుందని అందరూ భావిస్తారు. కానీ, అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం ఒక్క రోజే 16 జిల్లాల్లోని 63 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచాయి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో అత్యధికంగా 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. మరో 22 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి.
ఒకేసారి వర్షాలు, వడగాల్పులు వస్తుండటంతో ప్రజలు ఆరోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. వర్షం పడే సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల పక్కన నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు.
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 13 జూన్ 2026
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Telangana Bhavan Press Meet:పెన్షనర్లకు హెల్త్ కార్డులు ఎక్కడ?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్!
Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై సీఎం రేవంత్ విమర్శలు
Pawan : పవన్ తెలంగాణ కు ఎప్పుడైనా రావొచ్చు..పోటీ చేయవచ్చు – రేవంత్
TGSRTC Diesel Conservation:డీజిల్ భారం తగ్గాల్సిందే.. ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ వై. నాగిరెడ్డి సీరియస్ వార్నింగ్!
Husnabad Arrive Alive Program:ఆరైవ్ అలైవ్’ గర్జన..మంత్రి పొన్నం ప్రభాకర్ బంపర్ ఆఫర్!
Minister Ponguleti : కేంద్రంపై మంత్రి పొంగులేటి విమర్శలు