సినీ రంగం అనేది ఒక మాయా ప్రపంచం. ఇక్కడ కనిపించే వెలుగుల వెనుక ఎన్నో చీకటి కోణాలు, గుండెల్ని పిండేసే విషాదాలు దాగుంటాయి. ఎంతో మంది యువతీ యువకులు తమ కళ్లల్లో వేల కలలను నింపుకొని, నటనపై ఉన్న ఇష్టంతో ఈ
రంగుల ప్రపంచంలోకి అడుగుపెడుతుంటారు. తమ ప్రతిభతో ప్రేక్షకులను అలరించి, భవిష్యత్తులో నటులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తారు. అలా తన నిష్కల్మషమైన నటనతో, అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి భార్గవి . కానీ, దురదృష్టవశాత్తూ ఆమె జీవితం ఒక అర్ధాంతర విషాదాంతంగా ముగిసిపోయింది. * జూ. ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ... ఈ హీరోయిన్ని గుర్తు పట్టారా? ‘అష్టాచమ్మా’తో సెన్సేషన్న్యాచురల్ స్టార్ నాని, కలర్స్ స్వాతి జంటగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతంగా ఆవిష్కరించిన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అష్టాచమ్మా' (2008) సినిమాను తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ చిత్రంలో నానికి చెల్లెలిగా, శ్రీనివాస్ అవసరాల సరసన సెకెండ్ హీరోయిన్ పాత్రలో భార్గవి నటించింది. పల్లెటూరి పెంకితనం, అమాయకత్వం కలగలిసిన ఆ పాత్రలో ఆమె కనబరిచిన నటనకు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు దక్కాయి. టాలీవుడ్‌కు ఒక చక్కటి తెలుగు ముద్దుగుమ్మ దొరికిందని, ఆమె భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతోందని పరిశ్రమ పెద్దలు భావించారు. కానీ విధి ఆమెపై పగబట్టింది. కెరీర్ ఎదుగుతున్న సమయంలోనే ఆమె నూరేళ్ల జీవితం ఒక్కసారిగా ఆగిపోయింది. చిన్న పాత్రలతో మొదలైఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన భార్గవికి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఎక్కువ. 2006లో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్, ఇలియానా పరిచయమైన బ్లాక్‌బస్టర్ మూవీ 'దేవదాసు' ద్వారా ఆమె వెండితెరకు పరిచయమైంది. అందులో కాలేజీ విద్యార్థినిగా ఒక చిన్న పాత్రలోనే కనిపించినా, ఆమె నటనలోని స్పార్క్ అందరినీ ఆకట్టుకుంది. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా భార్గవి తన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకుంది. మా ఊరి వంట వంటి పాపులర్ షోస్, అమ్మమ్మ.కామ్, అమృతం వంటి ట్రెండ్ సెట్టర్ సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించి తెలుగు లోగిళ్లలో ఒక కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది. దీంతో పాటు వెండితెరపై వరుసగా అవకాశాలు అందుకుంటూ 'అన్నవరం', హాలిడేస్', 'అంజనీ పుత్రుడు', 'మిస్టర్ మేధావి', 'పాండురంగడు', అత్తిలి సత్తిబాబు వంటి ఎన్నో చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించింది. 'అష్టాచమ్మా' సినిమా ఘనవిజయం సాధించడంతో భార్గవి కెరీర్‌కు ఇక తిరుగుండదని అందరూ ఆశించారు. * నెట్టింట వైరల్ అవుతున్న ‘దృఢం’ బ్యూటీ.. కుర్రకారు గుండెల్లో నయా క్రష్‌గా మారిన లేడీ పోలీస్ టాలీవుడ్‌ను కుదిపేసిన మరణం సినిమా రంగంలో ఎదుగుతూ, ఎన్నో ఉన్నత ఆశలతో ఉన్న భార్గవి.. ఊహించని రీతిలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 2008 డిసెంబర్ 16న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసంలో భార్గవి నిర్జీవంగా పడి ఉండటం కలకలం రేపింది. ఆమెతో పాటు ప్రవీణ్ అనే వ్యక్తి మృతదేహం కూడా అదే గదిలో లభ్యమవడం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. పోలీసుల లోతైన దర్యాప్తులో అత్యంత షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. భార్గవి, ప్రవీణ్ ఇద్దరూ గతంలో ప్రేమించుకుని రహస్యంగా వివాహం చేసుకున్నారని, అయితే కొద్దిరోజులకే వారి మధ్య తీవ్ర మనస్పర్థలు వచ్చాయని తేలింది. భార్గవి నటిగా ఎదుగుతుండటాన్ని తట్టుకోలేక, తీవ్రమైన అనుమానంతో ప్రవీణ్ ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడని, ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. ఒక మంచి నటిగా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాల్సిన భార్గవి, తాను నమ్మిన వ్యక్తి చేతిలోనే మోసపోయి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం నిజంగా ఒక తీరని విషాదం. ఆమె భౌతికంగా మనల్ని విడిచి వెళ్లి ఇన్నేళ్లవుతున్నా, 'అష్టాచమ్మా' సినిమా బుల్లితెరపై వచ్చినప్పుడల్లా ఆ క్యూట్ అమ్మాయిని చూసి తెలుగు ప్రేక్షకుల కళ్లు నేటికీ తడిసిపోతూనే ఉంటాయి.