
ఆచార్య చాణక్యుడు భారతదేశపు గొప్ప పండితుల్లో ఒకరు. ఆయన బోధించిన సూత్రాలు, జీవిత పాఠాలు నేటికీ మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఒక వ్యక్తి 30 ఏళ్ల వయసు రాకముందే కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటే, వారి భవిష్యత్తు జీవితం చాలా సులభంగా, విజయవంతంగా మారుతుందని చాణక్యుడు చెప్పాడు.
మరి, చాణక్య నీతి ప్రకారం 30 దాటక ముందే నేర్చుకోవాల్సిన ఐదు విషయాలేంటో చూద్దాం... చాణక్యనీతి ప్రకారం.. సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోలేని వారు జీవితంలో గొప్ప అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది.
యవ్వనంలో సమయాన్ని సరిగా వాడుకున్నవారు మాత్రమే.. జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు. తొందరగా విజయం సాధిస్తారు. డబ్బు సంపాదించడమే కాదు, ఆదా చేయడం కూడా చాలా ముఖ్యం. చాణక్య నీతి ప్రకారం, ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసం తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేయడం చిన్న వయసు నుంచే నేర్చుకోవాలి.మనీ మేనేజ్మెంట్ చేయడం వచ్చిన వారు చిన్న వయసులోనే ఆర్థికంగా గొప్ప స్థాయికి వెళ్లగలరు.
మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో.. అదే మన జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఎల్లప్పుడూ మంచివారితో స్నేహం చేయాలి. చెడ్డ వారితో స్నేహం చేసేవారు జీవితంలో విజయాలు సాధించలేరు. ఈ విషయాన్ని చిన్న వయసులో తెలుసుకుంటే జీవితంలో తొందరగా సక్సెస్ అవుతారు.
చాలా మందికి ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం సరిగా తెలీదు. ఇలాంటి వారు కూడా లైఫ్ లో తొందరగా సక్సెస్ అవ్వరు. అందుకే.. ఒక వ్యక్తి సరైన సమయంలో తమ ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం నేర్చుకుంటే.. జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోరు.
తమ ఎమోషన్స్ ని కంట్రోల్ ఉంచుకునేవారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు జ్ఞానానికి అంతం లేదు. అందువల్ల, ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. చాణక్యుడు చెప్పినట్లుగా, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.
తమను తాము నవీకరించుకునే వారే జీవితంలో పురోగతి సాధించి, సమాజంలో గౌరవాన్ని పొందుతారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా