
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సద్దుమణిగే సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పుంజుకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య త్వరలో చారిత్రాత్మక ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటూ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్ సెంటిమెంట్‌ను సానుకూలంగా ప్రభావితం చేశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా పసిడి, వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది.శనివారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 1,48,590గా నమోదు కాగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,36,210 వద్ద కొనసాగుతోంది. అలాగే కిలో వెండి ధర రూ. 2,65,100కి చేరింది. విజయవాడలోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతుండగా, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,50,560గా ఉంది. ఇక ముంబైలో రూ. 1,48,590, దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1,45,830 వద్ద ధరలు నమోదయ్యాయి.అమెరికా-ఇరాన్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ సంకేతాలివ్వడంతో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదురుతుందన్న అంచనాలు మార్కెట్లో బలపడ్డాయి. ఒకవేళ ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, అటు కాల్పుల విరమణతో పాటు హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు పునరుద్ధరణకు నోచుకుంటాయి. దీనివల్ల చమురు ధరలు తగ్గి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో మదుపర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.అయితే, చర్చలు ప్రాథమిక దశలోనే