
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Telangana School Uniforms Changed: ప్రస్తుతం తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో విద్యార్థులందరూ బడికి వెళ్లడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్స్‌లో కీలకమైన మార్పులు చేసింది. ముఖ్యంగా రంగుల డిజైన్‌ను పూర్తిగా మార్చింది. పాత రెడ్ యాష్ కలర్ డ్రెస్సుల బదులు కొత్త రంగులు వస్తాయి. అబ్బాయిల షర్టులు, అమ్మాయిల టాప్స్ లైట్ బ్లూ రంగులో ఉండగా, అబ్బాయిల ప్యాంట్లు, అమ్మాయిల బాటమ్స్ ముదురు నీలం రంగులో ఉంటాయి. అలాగే 6, 7 తరగతుల అబ్బాయిలకు ప్యాంట్లు తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
గత ఏడాది ఇచ్చిన యూనిఫామ్స్ ఆకర్షణీయంగా లేవని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ డిజైన్ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కొత్త యూనిఫామ్ చొక్కా ముందు జేబు, చేతులపై ముదురు నీలం రంగు పట్టీలు ఉంటాయి. బాలికల పంజాబీ డ్రెస్ చొక్కా చేతులపై, వేయిస్ట్ కోట్ వద్ద ముదురు నీలం రంగు పట్టీలు ఉంటాయి.
ప్రభుత్వంలోని అన్ని స్థానిక సంస్థల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీ, పట్టణ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న మొత్తం 17,77,174 మంది విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం కోసం రెండు జతల కొత్త యూనిఫామ్స్ అందిస్తారు.
సమ్మర్ బ్రేక్ తర్వాత.. మొదట 2026 జూన్ 12న స్కూల్ సమ్మర్ బ్రేక్ తర్వాత బడులు తెరవాలని ప్లాన్ చేసినప్పటికీ, ఎండల తీవ్రత దృష్ట్యా సోమవారం జూన్ 15 నుండి పాఠశాలలు ప్రారంభమవుతాయి. 2026-27 విద్యా సంవత్సరం అప్పుడే మొదలవుతుంది. జూన్ 13, 14 తేదీలు వీకెండ్ హాలిడేస్ కాబట్టి, జూన్ 15 నుండి స్కూల్స్ నడుస్తాయని ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. మరోవైపు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును కనీసం 10 శాతం పెంచాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు లక్ష్యాలను కూడా నిర్ణయించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన ప్రధాన మార్పులు ఇవే: ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతిరోజూ ఉచిత బ్రేక్ ఫాస్ట్ , మధ్యాహ్న భోజనంతో పాటు పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తారు. విజయ డైరీ ద్వారా వారంలో మూడు రోజులు పాలు పంపిణీ చేస్తారు. మిగిలిన రోజుల్లో రాగి మాల్ట్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఇస్తారు. ఆహార నాణ్యతను పర్యవేక్షించడానికి, సరఫరాలో ఇబ్బందులు లేకుండా చేయడానికి డిజిటల్ ట్రాకింగ్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.