
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
I am Handsome Movie Review: గత కొంత కాలంగా తెలుగులో డిఫరెంట్ కథా నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో మెజారిటీ చిత్రాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అంతేకాదు కొంత మంది హీరోలు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి కథతో పాటు మెగాఫోన్ పట్టుకుంటారు. ఈ కోవలో దుర్గా దేవ్ నాయుడు మెగాఫోన్ పట్టుకొని హీరోగా నటించిన చిత్రం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం
కథ విషయానికొస్తే.. ఒక ఊరులో ఉండే యువకుడు మెడికల్ క్యాంప్ కోసం వచ్చిన లేడీ డాక్టర్‌ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ లవ్ ప్రయాణంలో వారి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు ఈ ప్రేమకు అంగీకరించయా..? చివరకు వీరి ప్రేమ ఫలించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. ఒక ఊరులో అందమైన యువతి రావడం ఆమెను తొలి చూపులోనే హీరో ప్రేమించడం.. ఇద్దరి మధ్య ఆస్తులు, అంతస్తుల తేడా నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ సినిమా కూడా ఈ కోవలోనే వచ్చిందే అయినా.. దర్శకుడి ట్రీట్మెంట్ కాస్త వెరైటీగా ఉంది. ముఖ్యంగా ప్రేమ నేపథ్యంలో ఇరు కుటుంబాల్లో ఉండే అనుబంధాలు, భావోద్వేగాలు నేపథ్యంలో దర్శకుడు ఎంచుకున్న కథనం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. దర్శకుడు గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించడం బాగుంది. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ బాగుంది. సినిమాకు సంగీతం ప్రాణంగా నిలిచింది. ఈ సినిమా సంగీత దర్శకుడికి మంచి భవిష్యత్తు ఉంది. క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. క్లైమాక్స్‌లో వచ్చే సెంటిమెంట్స్ ప్రేక్షకులను కదిలిస్తాయి.
నటీనటుల విషయానికొస్తే.. హీరోగా దుర్గా దేవ్ నాయుడు తన పాత్రలో సహజ సిద్ధంగా ఇమిడిపోయాడు. అచ్చమైన గ్రామీణ యువకుడి పాత్రలో లీనమై నటించాడు. ఇక హీరోయిన్ అన్విష కూడా కొత్త నటి అయిన చక్కని నటన కనబరిచింది. ముఖ్యంగా కిట్టయ్య, రూపకళ పాత్రలు కథకు బలాన్ని చేకూర్చాయి. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ఎమోషన్స్‌తో కూడిన సెన్సిటివ్ లవ్ స్టోరీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.