
జూన్ 2న హైదరాబాద్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ .. తమ పార్టీ జనసేన నాయకులతో కలిసి సభ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హైదరాబాద్ లో సభ పెట్టేందుకు అక్కడి
ప్రభుత్వం కానీ, విపక్షాలు కానీ అంగీకరించలేదు. తనపై వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఏపీలో కేసులు పెట్టిన వ్యవహారంతో తెలంగాణ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్న పవన్ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతివ్వకపోవడంపై ఆయన ఇప్పటికీ రుసరుసలాడుతూనే ఉన్నారు.కాంగ్రెస్ లో విలీనం దిశగా పిల్ల కాంగ్రెస్ లు..! జగన్ వైఖరి మారుతోందా ?ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఉన్న కారణాన్ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ వెల్లడించారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ వచ్చి వెళ్లేందుకు, పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ కు పూర్తి స్వేచ్ఛ ఉందని తెలిపారు. అయితే ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే తమ మంత్రులు స్పందించాల్సి వచ్చిందని రేవంత్ వెల్లడించారు. అలాగే శాంతి భద్రతల కారణాలతోనే పవన్ సభకు అనుమతి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలోనూ జగన్ సభలకు చాలా సార్లు అవకాశాలు ఇవ్వలేదని, అలా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పెద్దికి సాయం చేయబోయి ఇరుక్కున్న రేవంత్ సర్కార్..! హైకోర్టు షాక్..!ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సభకు పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో పాటు తెలంగాణ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయారు. అదే సమయంలో బీఆర్ఎస్ మాత్రం ఆచితూచి వ్యవహరించింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికీ తనను హైదరాబాద్ సభకు అనుమతించకపోవడంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ స్పందించినట్లు తెలుస్తోంది.