
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లుతున్న తరుణంలో, అసన్సోల్ టీఎమ్సీ
ఎంపీ, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఆంధ్రజ్యోతి, జూన్ 12: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. బెంగాల్ నుంచి ఢిల్లీ దాకా పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లుతున్న తరుణంలో, అసన్సోల్ టీఎమ్సీ ఎంపీ, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తన నాయకురాలు కేవలం మమతా బెనర్జీ మాత్రమేనని, పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ తనకు లీడర్ కాదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ సంక్షోభంలో ఉన్న తరుణంలో తాను 'దీదీ'ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
తిరుగుబాటు ఎంపీల జాబితాలో పేరు.. సిన్హా క్లారిటీ:
ఇటీవల లోక్సభలో ప్రత్యేక గ్రూపుగా ఏర్పడాలని భావిస్తూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమికి మద్దతు ప్రకటించే యోచనలో ఉన్న 19 మంది తిరుగుబాటు టీఎమ్సీ ఎంపీల జాబితాలో శత్రుఘ్న సిన్హా పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయన, మమతా బెనర్జీ పట్ల తన విధేయతను చాటుకుంటూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 'నేను మమతా దీదీతోనే ఉన్నాను, ఉంటాను, ఎప్పటికీ ఉంటాను. అభిషేక్ బెనర్జీ గానీ, మరెవరైనా గానీ నా లీడర్ కాదు. నా నాయకురాలు మమతా బెనర్జీ మాత్రమే. కష్టకాలంలో ఆమెను విడిచిపెట్టే ప్రసక్తే లేదు' అని శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు.
నేటి నుంచే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. పాక్తో భారత్ పోరు.. ఎప్పుడంటే?
భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత