
భారత్‌లో వేసవి కాలం గరిష్ఠ స్థాయికి చేరడంతో, మామిడి పండ్ల సీజన్ కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో, మామిడి పండ్లను కేవలం డెజర్ట్‌లు లేదా పానీయాలకే పరిమితం చేయకుండా, రోజువారీ భోజనంలో భాగంగా ఆస్వాదించే
సంప్రదాయ పద్ధతులపై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. 'ది హిందూ' కథనం ప్రకారం... దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కొన్ని ప్రత్యేకమైన కాంబినేషన్లు ఇవే:పెరుగన్నం - మామిడి పండు: తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ఇష్టమైన కాంబినేషన్. వేసవిలో భోజనం ముగించడానికి ఇది ఒక అద్భుతమైన ఎంపికని రెస్టారెంట్ నిర్వాహకుడు సంపత్ తుముల పేర్కొన్నారు. కమ్మనైన, రుచికరమైన పెరుగన్నం, మామిడి పండులోని తియ్యదనంతో కలిసి అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.పప్పు, అన్నం, మామిడి: అసోంలో చాలా కుటుంబాలు మసూర్ పప్పు, ఉడికించిన అన్నం, బంగాళాదుంప మ్యాష్తో పాటు తాజా మామిడి పండు ముక్కలను కలిపి తింటాయి. మామిడి పండ్ల సీజన్లో ఇది చాలా సులభమైన, రుచికరమైన భోజనం.ఆమ్రస్ - పూరీ/రోటీ: గుజరాతీ, మహారాష్ట్ర సంప్రదాయాల్లో మామిడి పండ్ల గుజ్జును (ఆమ్రస్) పూరీలతో కలిపి అందిస్తారు. ముఖ్యంగా బోహ్రా కమ్యూనిటీలో, పాలు కలిపిన ఆమ్రస్ను ఉదయం అల్పాహారంలో భాగంగా రోటీలు లేదా చపాతీలతో తింటారు.మ్యాంగో సలాడ్: తరిగిన మామిడి ముక్కల్లో కొద్దిగా ఉప్పు, పచ్చి మిరపకాయలు కలిపి తయారుచేసే స్వీట్ అండ్ సోర్ మ్యాంగో సలాడ్ కూడా మంచి ఆప్షన్. దీన్ని స్నాక్‌గా లేదా డిప్‌గా కూడా ఉపయోగించవచ్చు.అటుకులు - మామిడి: ఒడిశాలో పాలు, చక్కెరలో నానబెట్టిన అటుకులను (పోహా) మామిడి పండు ముక్కలు, తురిమిన కొబ్బరితో కలిపి