
ఇంటర్నెట్‌డెస్క్: సత్యదేవ్ కథానాయకుడిగా వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రావు బహదూర్’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచారంలో
భాగంగా శుక్రవారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. రాజసం ఉట్టిపడే పాత్రలు, విజువల్స్‌తో సరికొత్త అనుభవాన్ని పంచే చిత్రంగా ‘రావు బహదూర్’ను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఈ వార్త చదివారా: రివ్యూ: ‘సింగ్ గీతం’.. లెజెండరీ డైరెక్టర్ సింగీతం కొత్త మూవీ ఎలా ఉంది?