
విలక్షణ నటుడు సత్యదేవ్ (Satyadev) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన నటిస్తోన్న చిత్రాల్లో రావు బహదూర్ (Rao Bahadur ఒకటి. విలక్షణ నటుడు సత్యదేవ్ (Satyadev) వరుస సినిమాలతో బిజీగా ఉన్న
విషయం తెల్సిందే. ఆయన నటిస్తోన్న చిత్రాల్లో రావు బహదూర్ (Rao Bahadur ఒకటి. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా (Venkatesh Maha).. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రాన్ని జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా రావు బహదూర్ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సాధారణంగా తెలుగులో సైకలాజికల్ థ్రిల్లర్స్ రావడం చాలా తక్కువ. రావు బహదూర్ అలాంటి చిత్రమే అని చెప్పొచ్చు. టీజర్ విషయానికొస్తే.. రామప్పకు లివర్ క్యాన్సర్. నాలుగు నెలలకు మించి అతడు బతకడు అని డాక్టర్ చెప్తాడు. రామప్ప.. ఈ నాలుగు నెలలు భువనాలయం అనే బంగళాలో ఉండడానికి వెళ్తాడు. అక్కడ ఒంటరిగా ఉండడం వలనో లేక అనారోగ్య సమస్యల వలనో అతడు భ్రమలో, భయంతో, అనుమానంతో బతుకుతాడు. ఎవరో తన జీవితాన్ని నాశనం చేసినట్లు.. తనను చంపేస్తున్నట్లు భయపడుతుంటాడు. అందరూ అతనికి పిచ్చిపట్టింది అనుకుంటారు.. ? కానీ, 4 నెలలు బతకాల్సినవాడు ఏళ్ళు బతుకుతాడు. అసలు రామప్పకి ఏమైంది.. ? అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏంయి.. ? అతనిలైఫ్ లోకి వచ్చిన రేణుక ఎవరు.. ? ఈ రావు బహుదూర్ చివరికి బతికాడా.. ? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సత్యదేవ్ ఇప్పటివరకు ఎన్నో పాత్రల్లో నటించాడు. కానీ, ఈ సినిమాలో ఆయన నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మూడు డిఫరెంట్ పాత్రల్లో సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం ప్రేక్షకులను ఫిదా చేస్తోంది అని చెప్పొచ్చు. వెంకటేష్ మహా డైలాగ్స్ చాలారోజులు గుర్తుండిపోతాయని తెలుస్తోంది. రావు బహదూర్ అంటే ధైర్యం గల యువరాజు అని అర్ధం చెప్పి.. ఆ రాజు ఎందుకు పిచ్చివాడిగా మారాడు అనేదాన్ని చాలా సున్నితంగా చూపించబోతున్నట్లు టీజర్ ని బట్టి అర్ధమవుతోంది. స్మరన్ సాయి మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది. ఈ టీజర్ తోనే సినిమాపై ఒక హైప్ ని క్రియేట్ చేశారు మేకర్స్. జూలై 3 న రావు బహదూర్ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. మరి ఈ సినిమాతో సత్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
ఆ రోజు బాలయ్య ఆశీర్వదించినట్లే జరగడంతో.. ఆనందంలో నారా బ్రహ్మణి!
ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. నెల్సన్ సినిమా లేనట్టేనా
నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ