
ప్రేమించి పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో కన్న కూతురిపై తల్లిదండ్రులే పైశాచికంగా దాడి చేశారు. జుట్టు పట్టి ఈడ్చుకెళ్లి, కింద పడేసి చితకబాదారు. అంతటితో ఆగకుండా తండ్రి ఆమె మెడపై కాలు పెట్టి నొక్కడం అత్యంత దారుణం. బీహార్లోని మాధేపురా జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.వివరాల్లోకి వెళితే.. మాధేపురా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన పూజా కుమారి (22), అదే ప్రాంతానికి చెందిన బిట్టు కుమార్ (17) ప్రేమించుకున్నారు. సుమారు నెల రోజుల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వారిద్దరూ బంధువులు కావడం, ఇళ్లు కూడా దగ్గరదగ్గరగా ఉండటంతో ఈ వివాహం గురించి తెలియగానే ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రామస్థులు పంచాయితీ నిర్వహించారు. విచారణ జరిపిన పంచాయితీ, జంటను విడదీయాలని తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా అబ్బాయి కుటుంబానికి రూ.1 లక్ష జరిమానా విధించి, ఆ మొత్తాన్ని అమ్మాయి కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది.పంచాయితీ తీర్పు తర్వాత పూజా తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి అత్తవారింటి నుంచి పుట్టింటికి తిరిగి తీసుకొచ్చారు. అయితే, ఆమె ఇంటికి వచ్చిన వెంటనే పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఈ నెల 8వ తేదీన గ్రామస్థులందరూ చూస్తుండగానే పూజా తల్లి ఆమె జుట్టు పట్టి లాగి కిందపడేయగా, తండ్రి కూడా తీవ్రంగా కొట్టాడు. కూతురి మెడపై తండ్రి కాలు పెట్టి నొక్కి ఉంచిన దృశ్యాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి.ఈ దాడికి సంబంధించిన వీడియో